AP Assembly Elections: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. గెలిచేదెవరో తెలుసా?

AP Assembly Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌ సమరం కూడా ఉంది. ఆ రాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఏపీ ఎన్నికల విషయమై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ కలుగుతోంది. మరోసారి వైఎస్‌ జగన్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటాడా.. మూకుమ్మడిగా వస్తున్న టీడీపీ, జనసేన కూటమి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే విడుదలైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 1, 2024, 09:04 PM IST
AP Assembly Elections: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. గెలిచేదెవరో తెలుసా?

News Arena India Survey: ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి తన అధికారాన్ని నిలబెట్టుకుంటాడని న్యూస్‌ ఎరినా ఇండియా అనే సంస్థ వెల్లడించింది. స్పష్టమైన మెజార్టీతో ఫ్యాన్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రకటించింది. కాకపోతే గతంలో కంటే ఓ పాతిక సీట్లు తగ్గుతాయని పేర్కొంది. టీడీపీ, జనసేన పొత్తు అంతగా ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. ఆ రెండు పార్టీలకు కలిపి అరవై లోపు సీట్లు వస్తాయని తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 122 సీట్లు సొంతం చేసుకుంటుందని న్యూస్‌ ఎరినా ఇండియా తన సర్వేలో వెల్లడించింది. జగన్‌ పాలనను మెచ్చి 49.4 శాతం మంది ప్రజలు ఓటేస్తున్నారని వివరించింది. తెలుగుదేశం-జనసేన పార్టీలు 43.34 ఓట్ల శాతంతో 53 సీట్లు గెలుపొంది మరోసారి ప్రతిపక్ష స్థానానికి పరిమితం కానుందని జోష్యం చెప్పింది. ఈ ఎన్నికల్లో కూడా జాతీయ పార్టీలకు ఘోర పరాభవం తప్పదని ప్రకటించడం విశేషం. షర్మిల రాక వలన కొంత ప్రయోజనం ఉందని.. దానివలన కాంగ్రెస్‌ పార్టీకి 1.21 శాతం ఓట్లు పడతాయని సర్వేలో ఉంది.

సర్వే ఫలితాలు ఇలా..
మొత్తం స్థానాలు 175
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 122
టీడీపీ, జనసేనకు 53
ఈసారి కూడా కాంగ్రెస్‌, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతే

మొత్తం 88,700 మందితో శాంపిల్‌ సర్వే చేపట్టి స్పష్టమైన ఫలితాన్ని చెప్పినట్లు న్యూస్‌ ఎరినా ఇండియా సంస్థ వెల్లడించింది. మహిళలు జగన్‌కు పెద్ద ఎత్తున పట్టం కట్టారని వివరించింది. 54.77 శాతం మహిళలు, 45.68 శాతం పురుషులు వైసీపీకి అండగా నిలిచారు. కూటమికి 41 శాతం మహిళలు, 49 శాతం పురుషులు మద్దతు తెలిపారని సంస్థ తన సర్వే నివేదికలో పేర్కొంది.

కడప, విజయనగరం క్లీన్ స్వీప్
ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలను కూడా ప్రకటించింది. జగన్‌ సొంత జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని తెలిపింది. ఆ జిల్లాలోని పదికి పది స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరుతాయని ప్రకటించింది. రాయలసీమ ప్రాంతంలో జగన్‌కు మరోసారి తిరుగులేదని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. కర్నూలులో 12, అనంతపురంలో 8, చిత్తూరులో 12 స్థానాలు వైసీపీ వశమవుతాయని సర్వేలో ఉంది. పరిపాలన రాజధాని అంశం విశాఖపట్టణం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది. ఆ జిల్లాలో వైసీపికి కేవలం నాలుగు సీట్లు దక్కుతాయని, మిగతా పది టీడీపీ, జనసేనకు చేరుతాయని తెలిపింది. శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 11కు 11కు, తూర్పు గోదావరిలో 7, పశ్చిమలో 8, కృష్ణాలో 9, గుంటూరులో 11, ప్రకాశంలో 8, నెల్లూరులో 9 స్థానాల చొప్పున వైసీపీ గెలుస్తుందని న్యూస్‌ ఎరినా ఇండియా సంస్థ వెల్లడించింది.

ఓట్ల శాతం.. జిల్లాల వారీగా స్పష్టమైన సర్వే వెల్లడించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. ఈ సర్వే కూడా మరోసారి జగన్‌ అధికార పీఠాన్ని సొంతం చేసుకోబోతున్నారని తెలిపింది. ఈ సర్వే ఫలితాలతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. ఏ సర్వే చూసినా జగనన్నే మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సర్వే సంస్థలు రుజువు చేస్తున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

Also Read: IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు

Also Read: Telangana Jobs: నిరుద్యోగుల్లారా మీకు నేనున్నా.. కేసీఆర్‌లా కాదు 2 లక్షల ఉద్యోగాలిస్తా: రేవంత్‌ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News