Strict action on porn site visitors: పోర్న్ వీడియోలు చూస్తున్నారా..? ఇక మీ పని అంతే సంగతి..!!
Strict action on porn site visitors : పోర్న్ వీడియోలను చూసే వారిపై పోలీసుల నిఘా పెరిగింది. మహిళలపై లైంగిక వేధింపులు పెరగడంతో కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. పోర్న్ వీడియోలను చూసే వారిని పట్టుకుని ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.
Strict action on porn site visitors Watching Porn? Police Monitoring You : పోర్న్ వీడియోలను చూసే వారిపై పోలీసులు మరింత నిఘాను పెంచనున్నారు. స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, మరి ఏ ఇతర స్మార్ట్ డివైజ్‌లో అయినా సరే పోర్న్ చూస్తే మాత్రం అంతే సంగతులు. పోర్న్ వీడియోలను (Porn videos) చూసే వారినే కాదు.. ఆ వీడియోలను షేర్ చేసిన వారిని కూడా ఐపీ అడ్రెస్ ఆధారంగా కనిపెట్టనున్నారు ఖాకీలు. దొరికితే మాత్రం ఐటీ చట్టం కింద వెంటనే కేసు ఫైల్ చేస్తారు.
ఇంటర్‌నెట్‌లో పోర్న్ సైట్లలో (Porn sites) బ్రౌజింగ్ చేసే వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఐపీ అడ్రెస్‌ల ఆధారంగా అలాంటి వారిని గుర్తిస్తున్నారు. వారిపై నిఘా పెడుతున్నారు. పోర్న్ వీడియోలు చూడడం వల్ల మహిళలపై లైంగిక వేధింపులు (Sexual harassment) పెరుగుతున్నాయని ఉద్దేశంతో పోలీసులు నిఘా పెంచారు. వాటిని వీక్షించే వారిని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని (Hyderabad) మూడు కమిషనరేట్ల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోర్న్ వీడియోలను చూసే వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పోర్న్ (Porn) చూసినట్లు రుజువైతే మాత్రం వెంటనే ఐటీ యాక్ట్‌తో (IT Act) పాటు సెక్షన్స్ కింద కేసులు ఫైల్ అవుతాయి. నిందితులకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష (Imprisonment for seven years) విధించనున్నట్లు పోలీసులు (Police) వార్నింగ్ ఇస్తున్నారు.
అలాగే పోర్న్ వీడియోలను వాట్సాప్ లేదా ఏ ఇతర యాప్ ద్వారా అయినా షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు సమాయత్తమయ్యారు. పోర్న్ వీడియోలు చూడడం వల్ల మహిళలపై అఘాయిత్యాలు పెరగడంతో పోలీసులు నిఘా పెంచారు.
పోర్న్ వీడియోలపై (videos) చూసే వారి డేటా మొత్తం తీసే పనిలో పడ్డారు. ఎంత సమయం పాటు పోర్న్ వెబ్‌సైట్స్‌లపై ఉంటున్నారు... వాటిని డౌన్‌లోడ్ చేసుకునే డేటాతో పాటు ఎవరికి షేర్ చేస్తున్నారనే అంశాలపై నిఘా పెట్టారు పోలీసులు. ఎక్కువగా డౌన్‌లోడ్ (Download) చేయడం, ఇతరులకు షేర్ చేయడం వంటివి చేసే వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
ఇక ఇప్పటికే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలా పోర్న్ చూస్తోన్న కొందరిని పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయితే హెచ్చరిస్తే మారకుంటే మాత్రం అలాంటి వారిని అరెస్ట్ (Arrest) చేసేందుకు రంగం సిద్ధమైంది. కేసులు ఫైల్ చేసి, శిక్షలు విధిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.
Also Read : IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కరోనా కలకలం
ఇక పోర్న్ వీడియోలు షేర్ చేసేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులపై కూడా పోలీసులు నిఘా సారిస్తున్నారు. అలాంటి గ్రూప్ సభ్యులందరిపై యాక్షన్ తీసుకోనున్నారు.అయితే పోర్న్ (Porn) చూడడం వల్ల కొందరు ఉన్మాదులుగా మారుతున్నారని, అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు పోలీసులు (Police) అంటున్నారు. ఇలాంటి ఘటనలు గతేడాది చాలా జరిగాయని పేర్కొన్నారు. అందుకే పోర్న్ చూస్తున్న అందరిపై నిఘా పెంచుతున్నామని చెప్పారు. నిందితులకు (accused) కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు.
Also Read : Pushpa Movie: ‘'శ్రీవల్లి’' సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.