Summer Alert: వేసవికాలం ప్రారంభమవుతోంది.. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రత్తలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోత వేధిస్తోంది. ఎండలకు తాళలేక విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రత్తలు నమోదవుతుండడంతో విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన బోర్డు పరీక్షలు జరుగుతుండడంతోపాటు ఎండల ప్రభావంతో ఒంటి పూట బడులు కొనసాగించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Indiramma Indlu: కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌.. 11న ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం


తెలంగాణలోని పాఠశాలలను ఒంటి పూట మాత్రమే నిర్వహిస్తామని విద్యా శాఖ ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి పాఠశాలలు ఒకపూట మాత్రమే కొనసాగుతాయని వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ అన్ని పాఠశాలలు కూడా ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటి పూట బడుల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

Also Read: BJP Candidates: బిగ్‌ బ్రేకింగ్‌.. బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. పంతం నెగ్గించుకున్న ఆ ముగ్గురు


  • ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభం.

  • మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాల కొనసాగింపు


మధ్యాహ్న భోజనం 12.30 తర్వాత విద్యార్థులు తినేసి ఇళ్లలోకి వెళ్తారు. ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆ పరీక్షల సెంటర్‌ పడిన పాఠశాలలో మాత్రం ఒంటి పూట బడిని మధ్యాహ్నం కొనసాగించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఆ పరీక్షలు ముగిసిన వెంటనే తిరిగి ఆయా పాఠశాలల్లో ఒంటి పూట బడులు కొనసాగుతాయని విద్యా శాఖ వెల్లడించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి