Super Spreaders: కోవిడ్-19 వ్యాక్సినేషన్, Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం
Covid-19 Vaccination For Super Spreaders : తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటుతో పాటు పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా టీకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
దక్షిణాది రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ మహమ్మారిని మెరుగ్గా ఎదుర్కొంటున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటుతో పాటు పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా టీకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఈ నెల 28 నుంచి సూపర్ స్పెడర్స్‌కు కోవిడ్19 టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో హోటల్స్, సెలూన్లలో పనిచేసేవారు, బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, కిరాణా వర్తకులు, కూరగాయల వ్యాపారులు, హమాలీలు లాంటి వారికి కరోనా టీకాలు సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఈ సమస్యను దాదాపుగా నిర్మూలించేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్యక్షతన తాత్కాలిక సచివాలయం బీఆర్‌కే భవన్‌లో జరిగిన సమావేశంలో సూపర్ స్పెడర్స్‌కు కరోనా టీకాలు (COVID-19 Vaccine) ఇవ్వడంపై చర్చ జరిగింది. సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖల కార్యదర్శి రిజ్వి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: Covid-19 Symptoms: ఆ కరోనా బాధితులకు Steroids వాడకూడదు, ప్రముఖ వైద్యుడి సలహా
కరోనా వైరస్ ఎవరి కారణంగా, ఏయే వ్యక్తుల వల్ల వేగంగా వ్యాప్తి చెందుతుందన్న అంశంపై చర్చించారు. అందులో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, కిరాణా వర్తకులు, ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ డీలర్లు, హోటల్స్, సెలూన్లలో పనిచేసేవారు, కూరగాయల వ్యాపారులు, హమాలీలు, పూలు విక్రయించేవారు, చికెన్, మటన్ షాపు నిర్వాహకులు, మద్యం దుకాణాల వారికి ప్రత్యేకంగా తెలంగాణ(Telangana)లో కోవిడ్19 వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా కరోనా అతి వేగంగా వ్యాపించడానికి చెక్ పెట్టాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
Also Read: Milk Benefits: ప్రతిరోజూ పాలు తాగితే Cholesterol పెరుగుతుందా, నిపుణులు ఏమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook