Telangana: కరోనా పరీక్షలపై హై కోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
COVID-19 tests in Telangana | హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.
COVID-19 tests in Telangana | హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఆసుపత్రులలో చనిపోయిన వారికి కూడా కోవిడ్-19 పరీక్షలు జరపాలన్న హైకోర్టు ( Telangana high court) ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ( COVID-19: ఏపీలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు )
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినిపించిన వాదనలు విన్న సుప్రీం కోర్టులోని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో (Supreme court) ఊరట లభించినట్టయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..