Cash For Vote: రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు
Supreme Court Probe Adjourn In Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయగా.. వారిద్దరిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.
Cash For Vote: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే కొన్ని నిమిషాల్లోనే కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయడం గమనార్హం. వాయిదా వేస్తూనే సుప్రీంకోర్టు కీలక హెచ్చరిక జారీ చేసింది. 'మళ్లీ వాయిదాలు ఇవ్వం. ఇదే చివరి అవకాశం' అని స్పష్టం చేసింది. కేసు విచారణ ప్రారంభం కాగానే వాయిదా వేయాలని చంద్రబాబు తరఫున న్యాయవాదులతోపాటు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కూడా కోరారు. వీరి విజ్ఞప్తితో సుప్రీంకోర్టు కేసు విచారణను జూలై 24కి వాయిదా వేసింది.
Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?
సుప్రీంకోర్టులో గురువారం విచారణ ప్రారంభం కాగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు 'ఈ కేసును సెలవుల తర్వాత విచారణ జరపాలి' అని కోరారు. ఇక తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు 'ఈ కేసులో ఫైల్ చేసేందుకు కొంత సమయం కావాలి' అని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పరిశీలించి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చాలని ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై వీటితోపాటు మొత్తం ఐదు పిటిషన్లు రాగా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
Also Read: Nakrekal: కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటా
న్యాయస్థానం మరోసారి వాయిదా వేయడంపై ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కీలక ఆరోపణలు చేశారు. 'చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కు అయ్యారు. కేసు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఓటుకు నోటు కేసులో రూ.5 కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. రూ.50 లక్షలు డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఈ కేసు ముందుకు సాగకపోవడం వెనుక వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా చిన్న చిన్న కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి వాయిదా అని తెలిపింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు' అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటు కొనుగోలు కోసం 2015లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహాయం డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఏడేళ్లయినా విచారణలో పురోగతి లేదు. ఈ కేసుపై అనేక వాదనలు, వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఈ కేసు నీరుగారిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter