Munawar Faruqui: మునావర్ ఫరూకి షోపై సస్పెన్స్..హైటెక్ సిటీలో 2 వేల మంది పోలీసుల పహారా
Munawar Faruqui: ఫేమస్ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకి హైదరాబాద్ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో షో జరగాల్సి ఉంది. అయితే మునావర్ ఇంకా హైదరాబాద్ రాలేదు. ఆయన వస్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు.
Munawar Faruqui: ఫేమస్ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకి హైదరాబాద్ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో షో జరగాల్సి ఉంది. అయితే మునావర్ ఇంకా హైదరాబాద్ రాలేదు. ఆయన వస్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. తనకు ఫీవర్ రావడంతో శుక్రవారం బెంగుళూరు లో జరగాల్సిన షోను వాయిదా వేసుకున్నారు మునావర్ ఫరూఖి. ఫీవర్ రావడంతో కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని.. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నానని మునావర్ తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో హైదరాబద్ లో మునావర్ షో ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మునావర్ షోకి శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో శిల్పకళావేదిక లో సర్వం సిద్ధం చేశారు నిర్వాహకులు. మునావర్ షో టికెట్లను బుక్ మై షో లో విక్రయించగా పూర్తిగా అమ్ముడుపోయాయి. 2 వేల టికెట్స్ సేల్ చేశారు నిర్వాహకులు. మరోవైపు మునావర్ ఫరూఖీ షోకు అనుమతి ఇవ్వొద్దని గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు. షో జరిగితే మాత్రం అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. షో జరిగే వేదికను తగలబెడతామని హెచ్చరించారు. అయితే మునావర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను హేళన చేస్తూ షోలు చేస్తే ఊరుకునేది లేదంటున్న ఎమ్మెల్యే రాజసింగ్.. షోను అడ్డుకుని తీరుతామని వార్నింగ్ఇచ్చారు. దీంతో రాజాసింగ్ ను పోలీసులు శుక్రవారం తమ అదుపులోనికి తీసుకున్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మునావర్ షో ముగిసే వరకు రాజాసింగ్ పోలీసులు అదుపులోనే ఉండనున్నారు. మరోవైపు మునావర్ షో జరిగే హైటెక్ సిటీ శిల్పాకళా వేదిక దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2 వేల మందితో సెక్యురిటీ ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
స్టాండప్ కమెడియన్ గా ఫేమస్ అయిన మునావర్ ఫరూఖీ.. డోంగ్రీ పేరుతో షోలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు. అయితే తన షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తీవ్ర దుమారం రేగింది. కర్ణాటకలో మునావర్ షోలను నిషేధించారు. మునావర్ ఫరాఖీకి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు.ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా అనుమతి ఇచ్చింది.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook