హైదరాబాద్ నగరంలో ప్రాణాంతక స్వైన్ ఫ్లూ మహంమ్మారి రంగంలోకి దిగింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం నగరంలోని గాంధీ ఆస్ప్రతిలో ఇప్పటికే ఏడు స్వేన్ ఫ్లూ  కేసులు నమోదు అయ్యాయి. వీరికి స్వేన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో 8 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా వ్యాధి వ్యాప్తి చెందుతోందని..జనాలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లే సమయంలో మాస్కులు ధరించడం మేలను సలహా ఇస్తున్నారు. ఫ్ల్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని  వైద్యులు సూచిస్తున్నారు.