Tamilisai Soundararajan, Governor Of Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నమోదైన కేసులతో పోల్చితే ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా తీసుకోవాలని, తద్వారా కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటిస్తున్నారు. కేసీ తండాలో తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తండాలో నివసించే గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానమని చెప్పారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొందరు మాత్రమే కోవిడ్19 టీకాలు తీసుకుంటున్నారని, ఆ భయాన్ని పోగొట్టేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్లతో కరోనా వైరస్ నుంచి వారికి రక్షణ లభిస్తుందన్నారు. ఆ విషయాన్ని చాటిచెప్పేందుకు తాను తండాలో రెండో డోసు టీకా తీసుకున్నానంటూ గిరిజనులకు ధైర్యం చెప్పారు.



ఏ భయాలు లేకుండా కరోనా టీకాలు తీసుకోవాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. కరోనా సోకకుండా ఉండాలంటే తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని గిరిజనులకు సూచించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేత, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook