Teenmar Mallanna About CM KCR: జీ తెలుగు న్యూస్‌లో బిగ్‌ డిబేట్‌ విత్ భరత్‌ కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్‌ మల్లన్న పలు సంచలన విషయాలు వెల్లడించారు. జీ తెలుగు స్టూడియో సాక్షిగా ఒట్టేసి పలు అంశాలజోలికి వెళ్లబోనని ప్రకటించారు. కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేయడం వెనుక కారణమేంటని, జీ తెలుగు ఎడిటర్‌ భరత్‌ ప్రశ్నించగా.. జీ న్యూస్ తెలుగు స్టూడియో సాక్షిగా మరోసారి ఒట్టేసి చెబుతున్నానన్నారు మల్లన్న. ఇక నుంచి కేసీఆర్‌ జోలికి వెళ్లబోనన్నారు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఆయనమీదే ఒట్టేసి చెబుతున్నా కాబట్టి ఇక తాను ఆయనను ఏమీ అనబోనన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం మాటలు మాత్రమే చెప్పేవాళ్లను తెలంగాణలో బాతాల పోశెట్టి అంటారని, అందుకే ఇన్నాళ్లు కేసీఆర్‌ను బాతాల పోశెట్టి అని పిలిచేవాడినన్నారు. కేసుల భయంతోనే టీఆర్‌ఎస్‌వైపు సాఫ్ట్‌కార్నర్‌ తీసుకున్నారా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నిండా మునిగిన వాడికి చలి ఉండదన్నారు. తనకా భయం లేదన్నారు. 



కేసీఆర్‌ను తాను ఎప్పుడూ తిట్టలేదని, ప్రభుత్వాన్ని మాత్రమే తిట్టానన్నారు. ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాలని, ప్రజల కోసం పనిచేయాలని, సర్కారు బాధ్యత మరిచినందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, ఆ క్రమంలో ప్రభుత్వాధిపతిని విమర్శించానని తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna) చెప్పారు.


Also read : Teenmar Mallanna about ktr: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోతారన్న తీన్మార్ మల్లన్న


Also read : Teenmar Mallanna Interview: జీ న్యూస్ తెలుగు స్టూడియోలో ఎక్స్‌క్లూజీవ్‌గా తీన్మార్ మల్లన్న.. బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook