Teenmar Mallanna Exclusive Interview On Zee Telugu News: తీన్మార్ మల్లన్న.. తెలుగు వారికి పరిచయమే అక్కర్లేని పేరు. పాత్రికేయుడిగా కెరీర్ మొదలుపెట్టి.. పొలిటిషియన్‌గా మారిన తీన్మార్ మల్లన్న తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడుతున్న వారిలో ముందుంటారు. అలా పోరాడే క్రమంలోనే ఎన్నోకేసుల పాలైన తీన్మార్ మల్లన్న ఇప్పటికే రెండుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే జైలుకు వెళ్లొచ్చిన ప్రతీసారి ఒక కొత్త శక్తితో తిరిగొస్తున్న తీన్మార్ మల్లన్న ఈసారి జైలు నుంచి బయటికొస్తూనే కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలవుతూనే తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించడమే కాకుండా ముసుగులో గుద్దులాటలు లేకుండా తాను మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డిపైనే ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తీన్మార్ మల్లన్న చేసిన ఈ సంచలన ప్రకటన అటు రాజకీయవర్గాల్లో ఇటు తెలంగాణ సమాజంలో అనేక చర్చలకు దారితీసింది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీన్మార్ మల్లన్న చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టించడమే కాకుండా పలు సందేహాలకు కూడా తావిచ్చింది. స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం వేరు.. కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించడం వేరు.. కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించాకా అనేక అంశాలపై తీన్మార్ మల్లన్న తన స్టాండ్ ప్రకటించాల్సి ఉంటుంది. కేవలం పార్టీ జండా, అజండా, ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే కాకుండా.. ఇతర రాజకీయ పార్టీలతో తెలంగాణ నిర్మాణ పార్టీ వ్యవహరించే శైలి ఎలా ఉండబోతోంది ? ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన బండి సంజయ్ లాంటి నేతలతో తీన్మార్ మల్లన్న కలిసి పని చేయనున్నారా ? లేక తన దారి తను చూసుకోనున్నారా ? తెలంగాణ నిర్మాణ పార్టీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీచేస్తుందా ? లేక కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలకే పరిమితం అవుతుందా ? మంత్రి మల్లారెడ్డిపైనే తీన్మార్ మల్లన్న ఎందుకు పోటీకి దిగుతున్నారు ? మేడ్చల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ? తెలంగాణ నిర్మాణ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉండనుంది ? జైలు జీవితం తీన్మార్ మల్లన్నలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది ? అసలు జైలుకెళ్లి వచ్చిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా కొత్త పార్టీని, పార్టీ పేరును కూడా ప్రకటించారంటే ఇది ప్రీ ప్లానింగ్ అనే అనుకోవచ్చా ? జనం మదిని తొలిచేస్తోన్న ఇలాంటి ఎన్నో సంచలన ప్రశ్నలకు సమాధానం రాబట్టే వేదిక కానుంది జీ తెలుగు న్యూస్ ఎడిటర్ నిర్వహిస్తోన్న బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ ఇంటర్వ్యూ షో. తీన్మార్ మల్లన్న ఫ్యూచర్ పాలిటిక్స్‌పై ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే.. వీక్షించండి జీ తెలుగు న్యూస్‌లో బిగ్ డిబేట్ విత్ భరత్ ప్రత్యేక కార్యక్రమంలో తీన్మార్ మల్లన్నతో ఎక్స్‌క్లూజీవ్ లైవ్ ఇంటర్వ్యూ.



ఇది కూడా చదవండి : Teenmar Mallanna Political Plans: తీన్మార్‌ మల్లన్న ఏం చేయబోతున్నారు ? అనూహ్య నిర్ణయాల వెనుక వ్యూహమేంటి ?


ఇది కూడా చదవండి : Teenmar Mallanna New Party: జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీ పేరు ప్రకటన


ఇది కూడా చదవండి :  Teenmaar Mallanna Wife : మల్లన్నకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK