Teenmar Mallanna New Party: తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలయ్యారు. తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో చర్లపల్లి జైలు వద్దకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన అభిమానులు.. తీన్మార్ మల్లన్నకు అనుకూల నినాదాలతో చర్లపల్లి జైలు పరిసరాలను హోరెత్తించారు. ఈ సందర్భంగా తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. తను కొత్త పార్టీ పెడుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించిన తీన్మార్ మల్లన్న.. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయనున్నట్టు స్పష్టంచేశారు.
కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడంతో పాటు ఏకంగా మంత్రి మల్లా రెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించడం రాజకీయంగా చర్చనియాంశమైంది.
మంత్రి మల్లారెడ్డిపై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు
ప్రభుత్వంపై అదే పనిగా పోరాటం కొనసాగిస్తూ వస్తోన్న తీన్మార్ మల్లన్న.. ఎన్నో సందర్భాల్లో మంత్రి మల్లారెడ్డిపై తన వ్యతిరేక గళాన్ని వినిపించారు. అంగూటి మంత్రి అంటూ నేరుగానే రాజకీయ విమర్శలకు దిగిన తీన్మార్ మల్లన్న.. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో మంత్రి మల్లారెడ్డిపై వెల్లువెత్తిన ఎన్నో ఫిర్యాదులను ప్రస్తావిస్తూ అనేక సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అర్హత లేని వాళ్లు కూడా మంత్రులుగా కొనసాగుతున్న కేబినెట్ ఇదేనంటూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్‌పై అనేక విమర్శలు చేశారు.
ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ పరిసర ప్రాంతాల్లో మంత్రి మల్లారెడ్డి అనేక భూకబ్జాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లా రెడ్డికి లంచం ఇవ్వనిదే ఏ పని కాని పరిస్థితి నెలకొందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. తాజాగా తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలైన అనంతరం మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం నుంచే తాను పోటీకి దిగబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy News: ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలా..! ఎలా ఇస్తారయ్యా..? బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్
ఇది కూడా చదవండి : Minister Harish Rao Speech: బీజేపీ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం: మంత్రి హరీష్ రావు ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK