Teenmar Mallanna office raided by cops: హైదరాబాద్: తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసులు సోమవారం మరోసారి సోదాలు చేపట్టారు. మేడిపల్లిలోని క్యూ న్యూస్ ఆఫీసుకు చేరుకున్న సీసీఎస్ పోలీసులు సోదాల అనంతరం 10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్కులు, పలు ఇతర పత్రాలు, పుస్తకాలు తీసుకెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఇటీవల కాలంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులో సోదాలు జరపడం ఇది మూడోసారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న ఇటీవల కరోనా సోకినప్పుడు పీర్జాదిగూడలోనే ప్రజా క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ వద్ద కరోనావైరస్‌కు చికిత్స (Coronavirus treatment) తీసుకున్నారు. ఈ విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తంచేసిన పోలీసులు.. డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ను కూడా విచారించి అతడి నుంచి తమకు అవసరమైన సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.


Also read : Huzurabad bypolls: Harish Rao ఒక రబ్బర్ స్టాంప్ ఆర్థిక శాఖ మంత్రి: Eetala Rajender


తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బెదిరించి, ఆత్మహత్యాయత్నానికి పూనుకునేలా చేశాడంటూ లక్ష్మీకాంత్ శర్మ (Lakshmikanth Sharma) అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ (Teenmar Mallanna) చేసిన సంగతి తెలిసిందే.


Also read : Facebook swamiji: పూజలు చేసి పాస్‌ చేయిస్తాని.. MBBS student ని మోసం చేసిన దొంగ బాబా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook