తీన్మార్ మల్లన్నకు మరోసారి పోలీసులు నోటీసులు

Theenmar Mallanna in Chilakalaguda police station: హైదరాబాద్: ఏప్రిల్‌లో నమోదైన ఓ పాత కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రెండు రోజుల కిందట చిలకలగూడ పోలీసులు ఇచ్చిన 41 CRPC నోటీసులకు స్పందిస్తూ ఇవాళ తీన్మార్ మల్లన్న విచారణకు హాజరయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2021, 11:26 PM IST
తీన్మార్ మల్లన్నకు మరోసారి పోలీసులు నోటీసులు

Theenmar Mallanna in Chilakalaguda police station: హైదరాబాద్: ఏప్రిల్‌లో నమోదైన ఓ పాత కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రెండు రోజుల కిందట చిలకలగూడ పోలీసులు ఇచ్చిన 41 CRPC నోటీసులకు స్పందిస్తూ ఇవాళ తీన్మార్ మల్లన్న విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్స్‌తో కలిసి విచారణకు హాజరైన తీన్మార్ మల్లన్న విచారణ అనంతరం చిలకలగూడ పోలీసు స్టేషన్ నుంచి బయటికొచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. తనపై వ్యక్తిగత కక్ష్య, రాజకీయ అధికార పార్టీ అండదండలతోనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

విచారణ కోసం తనని పిలిపించి 6 గంటలపాటు స్టేషన్‌లో ఖాళీగా కూర్చోబెట్టారని తీన్మార్ మల్లన్న తెలిపారు. ఒక ప్రశ్న అడగడం, బయటికెళ్లి ఫోన్ మాట్లాడటం, మళ్లీ ఒక ప్రశ్న అడగటం, లోపలికి వెళ్లి ఫోన్ మాట్లాడటం.. ఇలాగే 6 గంటల సమయం గడిపేశారని వాపోయిన మల్లన్న.. ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారని అన్నారు. కేవలం రాజకీయ ప్రమేయంతోనే పోలీసులు ఈ విచారణకు తనను పిలిచారు కానీ వాస్తవానికి పోలీసులు (Police) కూడా ప్రభుత్వం, ఉన్నతాధికారుల చేతుల్లో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

Also read: దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసు: ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

గురువారం నాటి విచారణ పూర్తయిన అనంతరం 8వ తేదీన మరోసారి స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారని తీన్మాన్ మల్లన్న తెలిపారు. ఆరోజున కూడా కచ్చితంగా ఇలాగే పూర్తి సమయం తనను స్టేషన్‌లోనే ఉంచేందుకు కుట్ర చేస్తారని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు.

Also read: ఏపీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై త్వరలో స్పష్టత, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News