Huzurabad bypolls: Harish Rao ఒక రబ్బర్ స్టాంప్ ఆర్థిక శాఖ మంత్రి: Eetala Rajender

Harish Rao rubber stamp finance minister: Eetala Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad bypolls) ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న టీఆర్ఎస్, బీజేపి పార్టీలు.. ఈ ఎన్నికను ఇంతకు ముందెన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 07:50 PM IST
  • హుజూరాబాద్ కేంద్రంగా నేతల సవాళ్లు-ప్రతిసవాళ్లు.
  • మంత్రి హరీష్ రావు హీరో కాదంటున్న ఈటల రాజేందర్.
  • ఆయన ఒక విలన్‌లా ప్రవర్తిస్తున్నాడు: ఈటల
Huzurabad bypolls: Harish Rao ఒక రబ్బర్ స్టాంప్ ఆర్థిక శాఖ మంత్రి: Eetala Rajender

Harish Rao rubber stamp finance minister: Eetala Rajender: హుజూరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఒక రబ్బర్ స్టాంప్ మినిస్టర్ మాత్రమే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. '' నువ్వు మీ మామ, సీఎం కేసీఆర్‌ని గుడ్డిగా ఫాలో అయితే.. నీ పొలిటికల్ కెరీర్ మునగడం ఖాయం'' అని మంత్రి హరీష్ రావుకి ఉచిత సలహా ఇచ్చారు. గురువారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్.. ''దమ్ముంటే హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులపై మంత్రి హరీష్ రావు చర్చకు రావాలి'' అని బహిరంగ సవాల్ విసిరారు. ''నువ్వేమీ హీరోవు కావు. ఒక విలన్‌లా ప్రవర్తిస్తున్నావు'' అని వ్యాఖ్యానించే క్రమంలో మంత్రి హరీష్ రావును రబ్బర్ స్టాంప్ మినిష్టర్‌గా ఈటల రాజేందర్ అభివర్ణించారు. 

ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టివ్వలేదని మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన ఈటల రాజేందర్... మంత్రి హరీష్ రావుకి (Harish Rao) దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, ఏర్పాట్లు తానే చేస్తానని సవాల్ చేశారు. 

Also read : Telangana Schools Reopen: కరోనా ఆంక్షల మధ్య తెలంగాణలో మోగిన బడి గంటలు... ఫోటోస్

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad bypolls) ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న టీఆర్ఎస్, బీజేపి పార్టీలు.. ఈ ఎన్నికను ఇంతకు ముందెన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు గుప్పిస్తోంటే.. ఈటల (Eetala Rajender) సైతం అదే స్థాయిలో ఆ ఆరోపణలు తిప్పికొడుతూ అధికార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు విసురుతున్నారు. దీంతో హుజూరాబాద్ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

Also read : Dalita Bandhu scheme: దళిత బంధు స్కీమ్ రివ్యూ మీటింగ్‌లో CM KCR కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News