CM Kcr Aerial View: భద్రాది జిల్లాలో భారీ వర్షాలు.. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే రద్దు!
CM Kcr Aerial View: భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాతావరణం అనుకూలించడం లేదు. శనివారం రాత్రి నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కేసీఆర్ పర్యటనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి
CM Kcr Aerial View: భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాతావరణం అనుకూలించడం లేదు. శనివారం రాత్రి నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కేసీఆర్ పర్యటనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం హన్మకొండ నుంచి హెలికాప్టర్ లో భద్రాచలం వెళ్లాలి కేసీఆర్. గోదవారి వరద ప్రాంతాలను ఆయన హెలికాప్టర్ ద్వారా వీక్షించాలని. కాని భారీ వర్షాలతో హెలికాప్టర్ ప్రయాణానికి భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వడం లేదు. దీంతో రోడ్డు మార్గం గుండా వరంగల్ నుండి భద్రాచలం వెళుతున్నారు సీఎం కేసీఆర్. భారీ వర్షం కారణంగా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కూడా రద్దైంది.
భద్రాచలంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడడంతో పాటు వారికి ప్రభుత్వం కల్పించిన పునరావాసం, సహాయక చర్యలను అధికారులు, మంత్రులతో చర్చించనున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అందించే నష్టపరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది. గత నాలుగైదు రోజులుగా క్షేత్రస్థాయిలో ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ సహా ప్రజా ప్రతినిధులు, అధికారులతో తాజా పరిస్థితిని సమీక్షించనున్నారు. భద్రాచంలో గోదావరి వరదల ఎఫెక్ట్, పునరావాస కేంద్రాల పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్షించనున్నారు కేసీఆర్. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ శనివారం రాత్రికే వరంగల్ చేరుకున్న కేసీఆర్... మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేశారు. అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లారు.
సుదీర్ఘ కాలం తర్వాత భద్రాచాలం వచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇదో మూడో పర్యటన. 2015, 16లో రాములోరి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు కేసీఆర్ భద్రాచలం వచ్చారు. అప్పుడే ఆలయంతో పాటు భద్రాచలం అభివద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు. భద్రాచలంలో సమీక్ష అనంతరం కేసీఆర్ హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవంలో పాల్గొనాల్సి ఉంది. అయితే వాతావరణ పరిస్థితులతో కేసీఆర్ బోనాల వేడుక కోసం హైదరాబాద్ వస్తారా లేక అక్కడే ఉంటారా అన్నదానిపై స్పష్టత లేదు. సీఎంవో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సోమవారం కడెం, ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాంతాల్లో వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే చేస్తారు కేసీఆర్.వరద బాధితులను పరామర్శించనున్నారు. అధికారులతో సమీక్షించి సహాయచర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ?
Read Also: మండపంలో అందరిముందే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. సిగ్గుతో ఏం చేశాడో చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook