Lockdown extended in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ముందుగా తెలంగాణలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా ఆ గడువు మే 21న శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత లాక్‌డౌన్ విధించినప్పుడు కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకోగా.. తాజాగా సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పొడగింపు అంశంపై ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రులు కరోనా పరిస్థితిని, వైద్య సదుపాయాలను సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నందున ఈ నెల 20న జరగాల్సి ఉన్న తెలంగాణ కేబినెట్‌ భేటీని సైతం రద్దు చేశారు. 


Also read : TS EAMCET: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు


తెలంగాణలో లాక్‌డౌన్ వేళల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందునే లాక్‌డౌన్ (Telangana lockdown) విధానాన్ని కొనసాగించాలని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.


అత్యవసర పరిస్థితుల్లో లాక్‌డౌన్ సమయంలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే వారికి పోలీసులు ఈ పాస్ (e-pass rules in Telangana) జారీ చేస్తోన్న సంగతి తెలిసిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook