TS EAMCET: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

TS EAMCET application last date extended: హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుని ఏదో ఓ కారణంతో ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారికి గుడ్ న్యూస్. టిఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు రేపటి 18వ తేదీతో ముగియనుండగా దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెసర్ ఎ.గోవర్దన్‌ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2021, 11:59 PM IST
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

TS EAMCET application last date extended: హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుని ఏదో ఓ కారణంతో ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారికి గుడ్ న్యూస్. టిఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు రేపటి 18వ తేదీతో ముగియనుండగా దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెసర్ ఎ.గోవర్దన్‌ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 26 వరకు ఎలాంటి లేట్ ఫీ లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. యధావిధిగానే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులను సబ్మిట్ చేయవ‌చ్చని ప్రొ. గోవర్థన్ పేర్కొన్నారు.

Also read: WhatsApp privacy policy: వాట్సాప్ ప్రైవసీ పాలసీకి నో చెబితే వాట్సాప్ ఎకౌంట్స్ డిలీట్

ఇదిలావుంటే, కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ను పరీక్ష లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తామని చెప్పిన సర్కారు.. జూన్ రెండో వారంలో అప్పటి పరిస్థితిపై సమీక్ష చేపట్టిన తర్వాత రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్ష (TS Inter second year exams 2021) నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News