India Book Of Record: రెండేళ్ల తెలంగాణ బుడతడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం.. ఎలా దక్కిందో తెలుసా?
karimnagar boy vedansh sai : టాలెంట్‌లో చిచ్చరపిడుగు ఈ బుడతడు. కరీంనగర్ సప్తగిరికాలనీకి చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్ సాయిరెడ్డికి మంచి టాలెంట్ ఉంది. ఈ చిన్నోడి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వారు ప్రశంసిస్తూ కార్డు, మెడల్‌ను అందించారు.
Telangana 2Year-Old karimnagar boy vedansh reddy enters India Book Of Records : బోసి నవ్వులతో అందరి ఆకట్టుకునే ఆ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నారు. వయస్సులో చాలా చిన్నోడు.. కానీ టాలెంట్‌లో చిచ్చరపిడుగు ఈ బుడతడు. కరీంనగర్ సప్తగిరికాలనీకి చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్ సాయిరెడ్డికి ( vedansh sai reddy) మంచి టాలెంట్ ఉంది. ఈ చిన్నోడి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు (India Book Of Records) వారు ప్రశంసిస్తూ కార్డు, మెడల్‌ను అందించారు.
Also Read : H1B Visa: హెచ్ 1 బి వీసాల జారీలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు
అబ్బురపరుస్తున్న చిన్నారి
ఏడు పక్షులు, ఇరవై నాలుగు జంతువులు, ఇరవై రెండు శరీర భాగాలు, పది ఆహారపు వస్తువులు, 13 పండ్లు, రెండు కూరగాయలు, నంబర్స్, 8 జీకే ప్రశ్నలకు ఠకీఠకీమని జవాబులు చెప్పాడు ఈ చిన్నోడు. అందుకే ఈ బుడతడికి ఈ ఘనత దక్కింది. అలాగే 21 రకాల అభినయాన్ని (21 types of performances) పలికించగలడు. వరల్డ్ మ్యాప్ , ఆకారాల పజిల్స్ పూర్తి చేయగలడు ఈ బాబు. పేపర్ కప్పులతో పిరమిడ్ తయారు చేస్తాడు. వేదాంశ్ సాయిరెడ్డి వయస్సు ప్రస్తుతం రెండు సంవత్సరాల మూడు నెలలు. ఇంత చిన్న వయస్సులో ఇవన్నీ చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.
Also Read : LIC Special Campaign: మీ ఎల్ఐసీ గతంలో రద్దయిందా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి