H1B Visa: హెచ్ 1 బి వీసాల జారీలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు

H1B Visa: హెచ్ 1 బి వీసాల విషయంలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు రద్దయ్యాయి. తాజా తీర్పుతో హెచ్ 1 బీ వీసాల విషయంలో భారతీయులకు ఊరట కలగనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2021, 09:01 AM IST
  • హెచ్1 బి వీసాల జారీ విషయంలో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పు
  • వేతన ఆధారిత హెచ్ 1 బి వీసా విధానాన్ని కొట్టిపారేసిన కోర్టు
  • లాటరీ పద్ధతిలోనే వీసాల జారీకు ఆమోదం
H1B Visa: హెచ్ 1 బి వీసాల జారీలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు

H1B Visa: హెచ్ 1 బి వీసాల విషయంలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు రద్దయ్యాయి. తాజా తీర్పుతో హెచ్ 1 బీ వీసాల విషయంలో భారతీయులకు ఊరట కలగనుంది.

హెచ్ 1 బీ వీసాల(H1B Visa) ఆధారంగా హెచ్ 1 బీ వీసాలు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల్ని అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జి కొట్టిపారేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికారాల్ని ఉపయోగించుకుని వలస విధానంలో చాలా మార్పులు చేశారు. ఇందులో భాగంగా లాటరీ విధానాన్ని రద్దు చేశారు. ఫలితంగా భారతీయులకు చాలా సమస్యలెదురయ్యాయి. ఇప్పుడు తిరిగి ఫెడరల్ కోర్టు(Federal Court) లాటరీ విధానానికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారతీయులకు ఊరట కలిగింది.

గతంలోనే ఈ ప్రతిపాదనను కాలిఫోర్నియా జిల్లా కోర్టు న్యాయమూర్తి కొట్టిపారేశారు. అయితే దీనికి సంబంధించి వేరే ఇతర కారణాలు వెలుగులోకొచ్చాయి. వేతనాల ఆధారంగా హెచ్ 1 బీ వీసాలు మంజూరు చేస్తే విదేశాల్నించి తక్కువ వేతనాలకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోతుందని..ఇది కచ్చితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సవాలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన ఫెడరల్ న్యాయస్థానం కేసు కొట్టేశారు. తిరిగి పాత పద్ధతైన లాటరీ విధానానికే(Lotter System in H1B Visa) ఆమోదం తెలిపారు.హెచ్ 1 బీ వీసాపైనే ఐటీ కంపెనీలు ఇండియా, చైనాలకు చెందిన టెక్కీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిస్తుంటాయి. డోనాల్డ్ ట్రంప్(Donald Trump)సవరణల ప్రకారం వేతన ఆధారిత వీసాలు జారీ చేస్తే..అత్యంత నైపుణ్యం కలిగిన, భారీ వేతనాలు అందుకునేవారికే అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది. తక్కువ వేతనానికి ఉద్యోగుల్ని నియమించుకోవడం సాధ్యం కాదు. ఈ కారణంతోనే టెక్ కంపెనీలు ట్రంప్ ప్రతిపాదనల్ని వ్యతిరేకించాయి. ప్రతి యేటా 65 వేల హెచ్ 1 బీ వీసాలు మంజూరవుతుంటాయి.ఇందులో 20 వేల వీసాల్ని అడ్వాన్స్ డిగ్రీ ఉన్నవారికే ఇస్తారు. 

Also read: Viral Photo: ఆన్‌లైన్ క్లాస్‌లో అందరిని ఫూల్ చేసిన అమ్మాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x