Group-1 Preliminary Exam 2022: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఈ ఎగ్జామ్ కు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 503 గ్రూప్-1 పోస్టుల కోసం 3.80 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అయితే  2.86 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఎగ్జామ్ నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా  1,019 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష (Group-1 Prelims) జరిగింది. అభ్యర్థులను ఉదయం 8: 30 గంటల నుంచే సెంటర్స్ లోకి అనుమతించారు. ఎగ్జామ్ నిర్వహణను టీఎస్పీఎస్సీ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి కమిషన్ ఛైర్మన్, సభ్యులు పర్యవేక్షించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ ను ఎనిమిది రోజుల్లో విడుదల చేస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగియడంలో సహకరించిన సిబ్బందికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి కృతక్షతలు తెలిపారు. అయితే పరీక్షలో ప్రశ్నల సరళి సివిల్స్ స్థాయిలో ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలే ఎక్కువగా వచ్చినట్లు వారు తెలిపారు. రీజనింగ్, కరెంట్ ఆఫైర్స్, సైన్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ విభాగాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఇచ్చినట్లు తెలుస్తోంది.  ప్రిలిమ్స్ పేపర్ కఠినంగా ఉండటంతో కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. 


Also Read: Munugodu Bypoll War: మునుగోడు ఉపఎన్నిక హీట్, కొత్తగా పోస్టర్ల యుద్ధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook