Munugodu Bypoll War: మునుగోడు ఉపఎన్నిక హీట్, కొత్తగా పోస్టర్ల యుద్ధం

Munugodu Bypoll War: మునుగోడు ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ..రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు-ప్రత్యారోపణలతో పాటు పోస్టర్లక యుద్ధం మొదలైంది. మునుగోడు బరిలోని పోస్టర్ల యుద్ధం ఎలా ఉందో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2022, 09:48 PM IST
Munugodu Bypoll War: మునుగోడు ఉపఎన్నిక హీట్, కొత్తగా పోస్టర్ల యుద్ధం

తెలంగాణలో వరుసగా ఇది మూడవ ఉప ఎన్నిక. మొదటిది దుబ్బాక, రెండవది హుజూరాబాద్ కాగా ఇప్పుడు మునుగోడు. మునుగోడు ఉపఎన్నికలో కొత్తగా పోస్టర్ల వార్ రచ్చగా మారుతోంది. విభిన్న రకాల పోస్టర్లతో ప్రత్యర్దులు దాడులు చేసుకుంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడు ఉపఎన్నిక ఆ నియోజకవర్గానికి పరిమితం కావడం లేదు. మునుగోడు ఉపఎన్నికలో గతంలో జరిగిన ఉపఎన్నికల ప్రస్తావన వస్తోంది. ముఖ్యంగా వివిధ రకాల పోస్టర్లతో దాడులు జరుగుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు ఒకరిపై మరొకరు నేరుగా కాకుండా పోస్టర్ల రూపంలో ఆరోపణలు సంధించుకుంటున్నారు. మొన్నటివరకూ హాట్ టాపిక్‌గా మారిన కాంట్రాక్ట్ పే పోస్టర్ల వివాదం ముగియకముందే..ఇప్పుడు కొత్త పోస్టర్లు రాత్రికి రాత్రి వెలిశాయి. 

మునుగోడు ప్రజలా..మేం మోసపోయాం..మీరు మోసవద్దని దుబ్బాక, హుజురాబాద్ ప్రజలు చెబుతున్నట్టుగా పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి. ఈ పని ఎవరు చేశారనేది తెలియకపోయినా..ప్రజలకు మాత్రం అర్ధమౌతోంది. మరోవైపు చండూరులో మరో తరహా పోస్టర్ రచ్చచేస్తోంది. షా ప్రొడక్షన్ సమర్పించు..18 వేల కోట్లు నేడే విడుదల..దర్శకత్వం కోవర్ట్ రెడ్డి, సత్యనారాయణ 7ఎంఎం అంటూ సినిమా పోస్టర్ తరహాలో వెలిశాయి. ఈ పోస్టర్‌ను కాంగ్రెస్ ముద్రించిందా..టీఆర్ఎస్ ముద్రించిందా తెలియడం లేదు. బీజేపీ మాత్రం ఈ పోస్టర్‌తో ఇరకాటంలో పడింది. 

కర్ణాటకలో పేటీఎం తరహాలో సంచలనం రేపిన పేసీఎం పోస్టర్లకు నకలుగా..ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి.

మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17 చివరి తేదీ. ఇప్పటివరకూ 129 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడులో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. 

Also read: Munugode Bypoll: నర్సయ్య గౌడ్ జంప్.. రవికుమార్ గౌడ్ ఇన్.. మునుగోడులో జబర్దస్త్ పాలిటిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News