Minister Niranjan Reddy: రెండోసారి కరోనా బారినపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి...
Minister Niranjan Reddy tests Covid Positive : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రెండోసారి కరోనా బారినపడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో కరోనా బారినపడి కోలుకున్న ఆయనకు తాజాగా మరోసారి కరోనా సోకింది.
Minister Niranjan Reddy tests Covid Positive : తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మరోసారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో నిరంజన్ రెడ్డి కరోనా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. గతేడాది ఏప్రిల్‌లో కరోనా బారినపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి వైరస్ బారినపడటం గమనార్హం. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో పలువురు మంత్రులు, నేతలు గతంలో కరోనా (Covid 19) బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా కరోనా బారినపడ్డారు. దేశవ్యాప్తంగా సామాన్యులు,సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగతా వేరియంట్ల కన్నా వేగంగా విస్తరించే వైరస్ కావడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ పదేపదే హెచ్చరిస్తూనే ఉంది.
తెలంగాణలో వైరస్ కట్టడిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవలే ఫీవర్ సర్వేను నిర్వహించిన సంగతి తెలిసిందే. మున్ముందు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం (Telangana) చెబుతోంది. కేసుల విషయానికొస్తే.. బుధవారం (జనవరి 26) రాష్ట్రంలో 3,801 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: Mahesh Bank: సైబర్ దాడి కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. అదుపులో నిందితుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook