Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..
Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Hyderabad Bonalu festival 2024: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు బోనాల పండుగలకు అన్నిరకాల ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో.. గోల్కొండ లోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ఆషాడ మాసం ప్రారంభమౌతుంది. ఈసారి జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది. ఇక మరుసటి రోజు.. అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయి. నెల రోజుల పాటు హైదరాబాద్ లోని ప్రతి వాడ, ప్రతి గల్లీ ధూంధామ్ నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రత్యేకంగా తోట్లేలు సమర్పిస్తారు. శివసత్తులు, పొతురాజుల విన్యాసాలు, ప్రత్యేక వేషధారణలో భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తారు. బోనాలు సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.
మన దగ్గర ఆషాడ మాసంలో కూతురును పుట్టినిల్లుకు పంపించే సాంప్రదాయం ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలను సమర్పిస్తారు. ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకుంటారు. మొదటి బోనం హైదరాబాద్‌లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో, రెండో బోనం బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మూడో బోనం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు. బోనాల పండగ చివరి రోజు... రంగం వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాల పండుగ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ కూడా బోనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో, ప్రజలు ఇబ్బందులు పడకుండా, రోడ్లపై ప్రత్యేకంగా ప్యాచ్ వర్క్ చేయిస్తున్నారు. ఆలయాల సమీపంలో, గుంతలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం జులై 27 న సెలవు దినంగా ఇప్పటికే ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter