అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు తెలంగాణ ( Telangana ) సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) నిర్ణయించారు. ప్రగతి భవన్ లో పలు కీలకాంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ జరపడానికి సీఎం కేసీఆర్ ( Telangana cm kcr ) నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభమై ( Assembly from september 7 ) కనీసం 15-20 రోజులు సభ నడవవచ్చని తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని  సీఎం కేసీఆర్ మంత్రులు, అధికార్లతో జరిపిన సమీక్షలో నిర్ణయించారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులను, అధికారులను కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్సింగ్ ( Social Distancing ) పాటిస్తూ సభను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. Also read: Telangana: 20 అంబులెన్స్‌లు అందించిన జీ సంస్థ