హైద‌రాబాద్ : భార‌త‌ర‌త్న, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని ( Pranab Mukherjee ) స్మరించుకుంటూ తెలంగాణ శాస‌న‌స‌భ సమావేశాలలో భాగంగా నేడు సభలో ఆయనకు సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్ర‌ణ‌బ్ ముఖర్జీ మృతి ప‌ట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స‌భ‌లో సంతాప తీర్మానాన్ని ( Tribute to Pranab Mukherjee ) ప్ర‌వేశ‌పెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ ( CM KCR ) మాట్లాడుతూ.. ప్ర‌ణ‌బ్ ముఖర్జీ మృతి ( Pranab Mukherjee death ) ప‌ట్ల తెలంగాణ శాస‌న‌ స‌భ తరపున ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి దేశానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేసిన కేసీఆర్.. దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయిందని అన్నారు. 1970 త‌ర్వాత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టారని... అందుకే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి దేశాభివృద్ధిలో ప్ర‌త్యేక స్థానం ఉందని కేసీఆర్ గుర్తుచేశారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకుటిత దీక్ష, అంకిత‌భావంతోనే ప్రణబ్ ఉన్నత స్థానానికి ఎదిగారు అని సీఎం కేసీఆర్ కీర్తించారు. Also read : TS Vro System: సంచలన నిర్ణయం.. తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు!


ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ.. ప్ర‌తిప‌క్షాల‌ను సిద్ధాంత‌పరంగా మాత్ర‌మే విమ‌ర్శించడం తప్ప ఎవ్వరినీ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించని ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రణబ్‌ది అని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. జ‌ఠిల స‌మ‌స్య‌లను కూడా సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించే రాజనీతిజ్ఞుడిగా, మిత్ర ప‌క్షాల‌ను క‌లుపుకుని పోవ‌డంలో సమర్ధుడిగా ఆయ‌నకు పేరుందని అభిప్రాయపడ్డారు. దేశానికి ప్రణబ్ అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా 2019లో కేంద్రం ఆయన్ను భార‌త‌ర‌త్న అవార్డుతో ( Bharata Rantna Award ) సత్కరించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు స‌హాయపడటమే కాకుండా.. రాష్ర్ట విభ‌జ‌న బిల్లుకు ఆమోదం తెలిపి తెలంగాణ చ‌రిత్ర‌లోనూ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అని కొనియాడారు. Also read : TRS: కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి