Telangana Assembly Session 2021: ప్రతిపక్షాలు చేస్తున్నట్టు దళితబంధు పథకం హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll Election ) కోసం రూపొందించింది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అసెంబ్లీలో జరిగిన (Assembly Session) చర్చలో స్పష్టం చేశారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ వర్గాల సాధికారత కోసం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో తమ ప్రభుత్వం ఆలోచించిందని వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి గతేడాదే దళితబంధును (Dalitha Bandhu) ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ కరోనా (Coroan) కారణంగా వాయిదా పడిందన్నారు. రాష్ట్ర ఆదానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చినందున ఈ పథకానికి కేటాయించలేక పథకాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు. కేవలం పైలెట్ ప్రాజెక్టుగా మాత్రమే హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసినట్టు తెలిపారు. అంతకుముందే వాసాలమర్రి (Vasala Marri Village) గ్రామంలో లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు అందించిన విషయం ప్రతిపక్షాలు గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. 


Also Read: Three-day work week: ఆ స్టార్టప్ కంపెనీలో వారానికి 3 రోజులే Work.. ఎందుకో తెలుసా?


ముందుగా ప్రకటించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పథకం అమలు చేస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. గతంలో దళితుల అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయాలు కేటాయిస్తే కేవలం 1400 కోట్లు మాత్రమే దళితులకు చేరుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకే దళితబంధు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఫలాలు అందిస్తామని వివరించారు. పథకం అమలు తీరు పరిశీలనుక ప్రత్యేక బృందం పనిచేస్తుందన్నారు. కొన్ని మండాలాల్లో తానే స్వయంగా పరిశీలించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 


సామాజిక వివక్ష కారణంగానే దేశవ్యాప్తంగా దళితులు ఆర్థికంగా వెనబడి ఉన్నారని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. దళితుల్లో నిరుపేదలకు ముందుగా పది లక్షల రూపాయలు అందించి, దశలవారీగా చివరి లబ్ధిదారునికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని, తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ఇలాంటి పథకం రూపొందించడం గర్వంగా ఉందన్నారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇంతటి మహోన్నతమైన పథకం తీసుకువస్తే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం హుజూరాబాద్ లోనే ఉపఎన్నికల లేదు కదా.. ఇంతకు ముందు కూడా ఉపఎన్నికలు జరిగాయి కదా.. గతంలోనే సిద్దిపేటలో ప్రకటించాం కదా.. అలాంటప్పుడు ఉపఎన్నిక కోసం పథకం అమలు చేస్తున్నట్టు చవకబారు విమర్శలు ఎలా చేస్తారని మండిపడ్డారు. 


Also Read: Prabhas 25th movie: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ మూవీ ?


పథకం ఆవశ్యకతను గుర్తించి దళిత మేథావులు ప్రశంసిస్తున్నారని తెలిపారు. దళితబంధు విషయంలో ఎమ్మెల్యేలంతా బాధ్యతతో పని చేయాలని సూచించారు. ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాజకీయాలతీతంగా వీలైనంత వేగంగా సంపూర్ణంగా అందరికీ పథకం ఫలాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం సఫలీకృతమైతే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో ఉపయోగపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


దళిత వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఆచరణలో ఏమైనా ఆటంగాలు ఎదురైనా అధిగమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని, ప్రతి లబ్ధిదారునికి పథకం వర్తింపజేసేందుకు నిరంరం కృషి చేస్తామన్నారు. 


దళితబంధు (Dalitha Bandh) నిధుల మీద స్వయంగా లబ్ధిదారులకే పెత్తనం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పథకం మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాని సూచించారు. ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయల వ్యయం దాటుతుందని, రాబోయే ఏడేండ్లలో 23 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు.


Also Read: MAA Elections 2021: మా ఎన్నికలపై జూనియర్ ఎన్టీఆర్ అసహనానికి కారణమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook