Prabhas 25th movie: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ మూవీ ?

Sandeep Reddy Vanga to direct Prabhas: ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ అంటేనే అభిమానులకే కాదు.. ఆడియెన్స్‌కి కూడా ఎంతో క్రేజ్.. అందులోనూ సందీప్ రెడ్డి వంగ లాంటి ఫేమస్ డైరెక్టర్ డైరెక్షన్‌లో ప్రభాస్ సినిమా అంటే అభిమానులకు ఇంకెంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. అవును.. ప్రభాస్ 25వ సినిమాను (Prabhas 25) సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 02:14 PM IST
Prabhas 25th movie: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ మూవీ ?

Sandeep Reddy Vanga to direct Prabhas: ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ అంటేనే అభిమానులకే కాదు.. ఆడియెన్స్‌కి కూడా ఎంతో క్రేజ్.. అందులోనూ సందీప్ రెడ్డి వంగ లాంటి ఫేమస్ డైరెక్టర్ డైరెక్షన్‌లో ప్రభాస్ సినిమా అంటే అభిమానులకు ఇంకెంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. అవును.. ప్రభాస్ 25వ సినిమాను (Prabhas 25) సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాను డైరెక్ట్ చేసి తొలి సినిమాతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి మూవీకి వచ్చిన క్రేజ్ చూసి ఇతర సినీ పరిశ్రమలు సైతం ముచ్చటపడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండను (Vijay Deverakonda) సైతం ఓవర్ నైట్లో స్టార్‌ను చేసిన సినిమా అది. అర్జున్ రెడ్డి మూవీకి వచ్చిన క్రేజ్‌ను చూసి అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ (Kabir Singh) పేరిట రీమేక్ చేశారు. తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేశారు. 

హిందీలో కబీర్ సింగ్ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయగా తమిళంలో మరో దర్శకుడు తెరకెక్కించాడు. అర్జున్ రెడ్డి తరహాలోనే కబీర్ సింగ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) మరోసారి తనను తాను నిరూపించుకున్నట్టయింది. 

Also read : Shamita Shetty about Raj Kundra: రాజ్ కుంద్రా అరెస్ట్‌పై పెదవి విప్పిన షమిత శెట్టి

సందీప్ రెడ్డితో ప్రభాస్ 25వ సినిమాపై మరో రెండు రోజుల్లో ప్రకటన రానుందని టాలీవుడ్ ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ సినిమాను కేజీఎఫ్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ప్రభాస్ (Prabhas next movie look) సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

Also read : Acharya release date: ఆచార్య రిలీజ్ డేట్ ఫైనల్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News