Telangana Assembly: తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువుదీరనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇది మూడవ శాసనసభ. నాలుగురోజులపాటు జరిగే శాసనసభ సమావేశాల గెజిట్ విడుదలైంది. ముందు ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం, ఆ తరువాత ఎమ్మెల్యేలతో ప్రమాణం ఉంటుంది. శాసనసభ సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. స్పీకర్ ఎన్నిక ఇవాళ ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసనసభ సమావేశం ఇవాళ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు ఎప్పటి వరకూ జరుగుతాయనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ముందుగా ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత అసెంబ్లీ సమావేశం ప్రారంభమై..ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడి ఈనెల 13 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత ముందుగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగం, తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటాయి.


అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త స్పీకర్ ఎన్నిక తరువాత ఆయన అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలుంటాయి. శాసనసభ సమావేశాలకు ముందుగా తొలి కేబినెట్ సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి ఆమోద ముద్ర, అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2009 నుంచి 2017 జూన్ 2వ తేదీ వరకూ ఉద్యమకారులపై ఉన్న కేసుల్ని ఎత్తివేయడం, ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం అంశాలపై కేబినెట్ ఆమోదముద్ర పడనుంది. 


ప్రోటెం స్పీకర్‌గా  అక్బరుద్దీన్ వ్యవహరిస్తే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తుది షెడ్యూల్ మాత్రం బీఏసీ సమావేశం తరువాతే నిర్ధారణ కానుంది. 


Also read: Free Bus Journey: రేపటి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ.. ఈ బస్సుల్లోనే అనుమతి.. రూల్స్ ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook