Telangana Assembly session: హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, దీంతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సి ఉంది. కావున టీఆర్‌ఎస్ సర్కార్ మరో రెండు రోజులపాటు తెలంగాణ శాసనసభ సమావేశాలను (TS Assembly Session) నిర్వహించనుంది. అయితే ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13న ఉద‌యం 11:30 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుండగా.. 14న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌మండ‌లి ప్రారంభం కానుంది.  Also read: NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ మునిసిపల్ కార్పొ‌రే‌షన్‌ (GHMC) ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవ‌ర‌ణలు చేయనుంది. దీంతోపాటు ఇటీవల తెలంగాణ హైకోర్టు (High Court) సూచించిన మరి‌కొన్ని అంశాలపై కూడా ప్రభుత్వం చర్చించి చట్టాలు చేయనుంది. ఈ రెండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సర్కార్ చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. Also read: Prabhas: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్


ఇదిలాఉంటే.. గత నెల 16న శాస‌న‌సభ, మండలి సమా‌వే‌శా‌లను వాయిదా వేశారు. కానీ సమావేశాలు ముగిస్తున్నట్లు స్పీకర్, మండలి చైర్మన్ ప్రకటించలేదు. ఈ నేప‌థ్యంలో గవ‌ర్నర్‌ అను‌మతి లేకుండానే... స్పీకర్‌, మండలి చైర్మ‌న్‌ రెండు రోజుల సమా‌వే‌శా‌లపై నోటి‌ఫి‌కే‌షన్‌ను విడు‌దల చేయనున్నారు.  Also read: Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe