Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’

టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు నటించిన సినిమా ‘వీ’ గత నెలలో ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కారణంగా నిలిచిపోయిన నాని 26వ సినిమా ‘టక్ జగదీష్’ ( Tuck Jagadish ) షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

Last Updated : Oct 8, 2020, 04:03 PM IST
Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’

Nani joined ‘Tuck Jagadish’ Movie shooting: టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు నటించిన సినిమా ‘వీ’ గత నెలలో ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కారణంగా నిలిచిపోయిన నాని 26వ సినిమా ‘టక్ జగదీష్’ ( Tuck Jagadish ) షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. అయితే వీ సినిమా చేస్తున్నప్పుడే ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పై ఉంది. దాదాపు 30-40శాతం పూర్తయిన టక్ జగదీష్ సినిమా షూటింగ్ కాస్త కరోనా లాక్డౌన్ కారణంగా సుమారు 7నెలలపాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించింది చిత్ర యూనిట్. అయితే నాని కూడా టక్.. వేసుకోని మరి సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. 

టక్ వేసుకోని చేతిలో మాస్క్ పట్లుకున్న ఫొటోను నాని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అంతేకాకుండా ‘జగదీశ్ షూటింగ్‌లో చేరాడు.. టక్ ప్రారంభమైంది’.. అంటూ క్యాప్షన్ కూడా రాశాడు. దీంతో అప్పటినుంచి ఈ ఫొటో సినిమా అంచనాలను మరింత పెంచుతూ.. సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. చాలారోజుల తర్వాత నాని సినిమా టక్ జగదీష్ షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. Also read: Indian Air Force Day 2020: ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం: ఐఏఎఫ్ చీఫ్ భ‌దౌరియా

నాని న‌టిస్తున్న ఈ ట‌క్ జగ‌దీష్ సినిమాను నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రీతూ వ‌ర్మ (Ritu Varma), ఐశ్వ‌ర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని-శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అంతకుముందు వ‌చ్చిన నిన్నుకోరి, మజ్ను సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రోసారి ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.  Also read: IndiGo విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News