Bandi Sanjay counter attack on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. జనగామ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతోందనే భయం కేసీఆర్‌లో మొదలైందని.. తన అవినీతిపై విచారణ ప్రారంభమవుతుందనే భయంతోనే సోయి లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదు కాబట్టే బీజేపీని టార్గెట్ చేశాడన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలుచేస్తానని చెప్పడానికే జనగామలో బహిరంగ సభ ఏర్పాటు చేశారన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు.. ఎంతమందికి రుణమాఫీ చేశారు.. ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించారని నిలదీశారు. హుజురాబాద్‌లో 20 వేల మందికి దళిత బంధు పథకం కింద రూ.20 లక్షలు ఇచ్చామని చెబుతున్నారని.. వెంటనే ఆ లబ్ధిదారుల జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.


వ్యవసాయ పంపు సెట్లకు కేంద్రం మీటర్లు పెట్టాలంటోందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సంజయ్ తప్పు పట్టారు. ఆ మేరకు కేంద్రం ఏదైనా లేఖ ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో 22 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం ఎందుకు తగ్గించలేదన్నారు. ధనిక రాష్ట్రం కాస్త కేసీఆర్ దరిద్రపు పాలనలో అప్పుల పాలైందని విమర్శించారు.  విద్యుత్ డిస్కంలకు రూ.48వేల కోట్లు రాష్ట్రం బకాయి పడిందని.. వాటిని ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం విచారణకు సిద్ధమవుతున్నందున మరోసారి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. 


కాగా, శుక్రవారం (ఫిబ్రవరి 11) జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ, బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మోదీని దేశం నుంచి తరిమికొడుతామని.. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతామని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా, మెడికల్ కాలేజీలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. ఇలా అన్ని అంశాల్లోనూ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మోదీని, బీజేపీ సర్కార్‌ను కేసీఆర్ టార్గెట్ చేయడంతో బండి సంజయ్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు.


Also Read: Ishan Kishan MI: ఇషాన్ కిషన్‌పై కాసుల వర్షం.. 'తగ్గేదేలే' అంటూ భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్!!


Also Read: IPL 2022 Auctioneer: ఐపీఎల్ 2022 వేలంలో అపశృతి.. గుండెపోటుతో కుప్పకూలిన ఆక్షనర్ హెడ్మెడెస్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook