Bandi Sanjay on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ మరోసారి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నూతన సాగు చట్టాల రద్దుకు.. కేసీఆర్ చేసిన దీక్షకు (Bandi Sanjay comments on KCR) అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ దీక్ష చేసింది పంజాబ్ రైతుల కోసమా? తెలంగాణ రైతుల కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్​.


యాసంగి పంట కొనుగోలు అంశంపై దీక్ష చేసినట్లు కేసీఆర్ చెప్పారని.. దీని వల్లనే సాగు చట్టాలపై మోదీ ప్రభుత్వం దిగొచ్చిందనటమేమిటో తనకు అర్థం (Bandi Sanjay on Farm laws) కాలేదన్నారు. కేసీఆర్ దీక్షకు, కేంద్రం సాగు చట్టాల ఉపసంహరణకు సంబంధం లేదని పేర్కొన్నారు.


Also read: స్పీకర్ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన కేసీఆర్‌, జగన్‌..


Also read: గురుకులంలో కరోనా కలకలం.. 27 మంది విద్యార్థినులకు పాజిటివ్


ఆ ఘనత బీజేపీదే..


ఒకప్పుడు శబ్దకాలుష్యం, ట్రాఫిక్ సమస్య ఎక్కువుతుందనే కారణాలతో ధర్నా చౌక్ ఎత్తివేయాలని కేసీఆర్ పిటిషన్లు వేసినట్లు గుర్తు చేశారు బండి సంజయ్​. కానీ ఇటీవల ఆయనే స్వయంగా ధర్నా చౌక్​లో కూర్చున్నారని పేర్కొన్నారు.


కేసీఆర్​ను ఫామ్​ హౌస్​ నుంచి ప్రగతి భవన్​కు, ప్రగతి భవన్ నుంచి ధర్నా చౌక్ వద్దకు తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే రైతులు, బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు.


Also read: ఆ విషయంలో కేసీఆర్‌ను ఎలా నమ్మేది... సూటిగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి...


ఈ సందర్భంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పిందా? లేదా అని ప్రశ్నించారు. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయి రైతులు ఇబ్బందులు పడుపతుంట.. సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించార బండి సంజయ్.  రైతుల ఆత్మహత్యల పరంగా దేశంలోనే తెలంగాణ నాల్గవ స్థానంలో ఉందని వెల్లడించారు సంజయ్. ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.


Also read: తెలంగాణలో విషాదం..కాల్వలోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్య


Also read: జాతీయ స్థాయి నీట్‌లో తెలంగాణ ర్యాంకుల వివరాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook