స్పీకర్ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన కేసీఆర్‌, జగన్‌..

తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జల వివాదం తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 03:11 PM IST
స్పీకర్ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన కేసీఆర్‌, జగన్‌..

TS News: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం హైదరాబాద్‌(Hyderabad)లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM KCR), ఏపీ సీఎం జగన్‌(CM Jagan) హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, జగన్‌ పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు.

జలవివాదం అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు సీఎంలు కాసేపు మాట్లాడుకున్నారు.  స్పీకర్ మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం(Marriage).. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ స్పీకర్‌ తమ్మినేని,  వైఎస్‌ విజయమ్మ(YS Vijayamma)తో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

Also Read: ఆ విషయంలో కేసీఆర్‌ను ఎలా నమ్మేది... సూటిగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి...

ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు సీఎం జగన్‌(CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో కౌంటర్స్ ఇస్తున్నారు. జల వివాదంపై అయితే ఏకంగా ప్రభుత్వాల మధ్య లేఖల యుద్దమే జరుగుతుంది. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు ఎదురుపడటం, కూర్చుని మాట్లాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News