Bandi Fire On Kcr:టీఆర్ఎస్ నేతలను కట్టేయండి.. పాదయాత్రలో సంజయ్ పిలుపు
Bandi Fire On Kcr:చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ ను పెట్టుకున్న కేటీఆర్... చేనేతలకు చేసిన సాయమేందని నిలదీశారు. చేనేత కార్మికుల అమాయకత్వాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలోనూ చేనేతల దుస్థితి మారలేదన్నారు. బతకమ్మ చీరెల బిల్లలు ఇంతవరకు రాలేదని సంజయ్ విమర్శించారు.
Bandi Fire On Kcr:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మండుటెండల్లోనూ సంజయ్ పాదయాత్రలో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. యాత్రలో భాగంగా 17వ రోజు బివండి కాలనీ నుంచి సంజయ్ యాత్ర మొదలైంది. బివండిలో సంజయ్ కు స్థానికులు స్వాగతం పలికారు. తర్వాత సింగారం గేట్ మీదుగా జాజపూర్ గ్రామం చేరుకోన్నారు. జాజాపూర్ లో చేనేత కుటుంబాల ఇళ్లకు వెళ్లారు. చేనేత మగ్గాలను సందర్శించారు. అనంతరం జాజాపూర్ గ్రామంలో జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్నారు. అక్కడి చేనేత కార్మికులతో ముచ్చటించారు బండి సంజయ్.
చేనేత కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బండి సంజయ్ ముందు ఏకరవు పెట్టారు. ఒకప్పుడు తమ గ్రామంలో 500 మగ్గాలుంటే... నేడు 10 కూడా లేవని వాపోయారు. బతకడమే కష్టంగా ఉందని వాపోయారు. తమ ప్రాంతంలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే తమకు ప్రయోజనం కలుగుతోందని చెప్పారు.చేనేత మగ్గాలు కనుమరుగవుతున్నాయని, ప్రస్తుతం తీవ్ర ఆర్దిక సంక్షోభంలో ఉన్నామని, తమ పిల్లలను చదివించుకునే స్తోమత కూడా లేదని వాపోయారు. ఉపాధి లేక షోలాపూర్, బీవండి వంటి ప్రాంతాలకు వలసలకు వెళుతున్నారని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ పాలన, టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకు కేసీఆర్ మోసాలు అర్ధమయ్యాయని.. ఇక కేసీఆర్ పప్పులు ఉడకవ్ అని హెచ్చరించారు. గ్రామాలకు కేంద్రం ఏమిస్తుందో... రాష్ట్రం ఏమిస్తుందో అన్నీ తెలిసిపోయాయ్ అన్నారు. కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బండి సంజయ్. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ ను పెట్టుకున్న కేటీఆర్... చేనేతలకు చేసిన సాయమేందని నిలదీశారు. చేనేత కార్మికుల అమాయకత్వాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలోనూ చేనేతల దుస్థితి మారలేదన్నారు. బతకమ్మ చీరెల బిల్లలు ఇంతవరకు రాలేదని సంజయ్ విమర్శించారు.
కేసీఆర్ ను నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చాక ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ. 4 లక్షల కోట్ల అప్పుల పాల్జేశారని సంజయ్ మండిపడ్డారు. పేదలంటేనే కేసీఆర్ కు చులకన అని.. ఎన్నికల్లో డబ్బులిస్తే ఓట్లేస్తారనే చులకన భావంతో ఉన్నారని బండి ఫైరయ్యారు. కేసీఆర్ కు కండ కావరమెక్కిందన్నారు. ఈసారి టీఆర్ఎస్ నేతలు మీ వద్దకొస్తే.. ఇక్కడే కట్టేసి వలసలు చూపించండని జనాలకు సంజయ్ పిలుపిచ్చారు. చేనేత కష్టాలు కళ్లారా చూపించండి.. అప్పుడైనా బుద్ది వస్తుందేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
READ ALSO: KTR CONTROVERSY SPEECHES: నోరు జారుతున్న కేటీఆర్... ఫ్రస్టేషనా.. పీకే వ్యూహమా?
Case on Puvvada Ajay Kumar: మరో వివాదంలో మంత్రి పువ్వాడ అజయ్.. స్టైఫండ్ లాక్కుంటున్నారనీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.