KTR CONTROVERSY SPEECHES: నోరు జారుతున్న కేటీఆర్... ఫ్రస్టేషనా.. పీకే వ్యూహమా?

KTR CONTROVERSY SPEECHES: ఇటీవల కాలంలో కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతుండటం టీఆర్ఎస్ నేతలను పరేషాన్ చేస్తోంది. కేటీఆర్ ఎందుకిలా మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే కేటీఆర్ మాటల వెనుక రాజకీయ వ్యూహం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 02:00 PM IST
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్
  • కేటీఆర్ పై విరుచుకుపడుతున్న ఏపీ నేతలు
  • కేటీఆర్ ప్రసంగాలతో టీఆర్ఎస్ నేతల పరేషాన్
KTR CONTROVERSY SPEECHES: నోరు జారుతున్న కేటీఆర్... ఫ్రస్టేషనా.. పీకే వ్యూహమా?

KTR CONTROVERSY SPEECHES: కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దులో అనర్గళంగా మాట్లాడుతారు కేటీఆర్. ఆయన ప్రసంగాలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కేటీఆర్ సౌమ్యంగా మాట్లాడుతారని టాక్. అందుకే ఆయనకు అభిమానులు ఎక్కువ అంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు ఉద్వేగ ప్రసంగాలు చేసినా.. వ్యక్తిగత దూషణలకు దిగినా.. కేటీఆర్ మాత్రం కూల్ గానే మాట్లాడేవారు. కాని ఇటీవల కాలంలో కేటీఆర్ లో మార్పు వచ్చింది. ప్రసంగాల్లో దూకుడు పెంచారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కేటీఆర్. ప్రధాని మోడీని కూడా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలను.. ఏకవచనంతో సంభోదిస్తూ రెచ్చిపోతున్నారు కేటీఆర్. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ఇటీవల సిరిసిల్లలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్.. ప్రధాని మోడీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అని కూడా గౌరవం చూపకుండా పరుష పదజాలం వాడారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అయితే వాడు.. వీడు అంటూ మాట్లాడుతున్నారు కేటీఆర్. గతంలో కేటీఆర్ పై విపక్ష నేతలు విమర్శలు, ఆరోపణలు చేసినా కేటీఆర్ కూల్ గానే కౌంటరిచ్చేవారు. కాని తాజాగా ఆయన తీరును చూస్తున్న టీఆర్ఎస్ నేతలు ఒకింత అశ్చర్యానికి లోనవుతున్నారు. విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్న కేటీఆర్.. తాజాగా పొరుగు రాష్ట్రంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ ఆయన చేసిన కామెంట్లు రాజకీయ రచ్చ రాజేశాయి. కేటీఆర్ పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. గతంలో వైసీపీ నేతలు కేటీఆర్ ప్రశంసిస్తూ మాట్లాడేవారు. తాజా ఘటనపై కేటీఆర్ ను ఏపీ లీడర్లు టార్గెట్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు కేటీఆర్. ఏపీ సీఎం జగన్ కు తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. జగన్ పాలనలో ఏపీ పురోగమించాలని ఆకాంక్షించారు.

ఇటీవల కాలంలో కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతుండటం టీఆర్ఎస్ నేతలను పరేషాన్ చేస్తోంది. కేటీఆర్ ఎందుకిలా మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే కేటీఆర్ మాటల వెనుక రాజకీయ వ్యూహం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో భాగంగానే కేటీఆర్ దూకుడు పెంచారని, మాటల్లో వాడి పెంచారని చెబుతున్నారు. బెంగాల్ ఎన్నికల్లోనూ టీఎంసీ నేతలు ఇలానే వ్యవహరించారని వాళ్లు గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ ప్రసంగాలపై మరో వాదన కూడా వస్తోంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరగడంతో కేటీఆర్ లో ఫ్రస్టేషన్ పెరిగిందనే విమర్ళలు వస్తున్నాయి. పార్టీలో అసమ్మతి పెరగడంతో విపక్షాలపై ఇలా కేటీఆర్ విరుచుకుపడుతున్నారని అంటున్నారు. మొత్తంగా కేటీఆర్ లో వచ్చిన మార్పుతో గులాబీ లీడర్లు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.  

READ ALSO: Case on Puvvada Ajay Kumar: మరో వివాదంలో మంత్రి పువ్వాడ అజయ్.. స్టైఫండ్ లాక్కుంటున్నారనీ..

                    CPI Narayana: కేటీఆర్‌ కు మద్దతు తెలిపిన సీపీఐ నారాయణ..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News