Case on Puvvada Ajay Kumar: మరో వివాదంలో మంత్రి పువ్వాడ అజయ్.. స్టైఫండ్ లాక్కుంటున్నారనీ..

Case on Puvvada Ajay Kumar: మంత్రి అజయ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను బెదిరించి వారికొచ్చే స్టైఫండ్  లాక్కుంటున్నారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఖమ్మంలో మంత్రి అజయ్‌కు చెందిన మమతా కాలేజీపై ఆరోపణలు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 11:53 AM IST
  • మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు
  • విద్యార్థుల స్టైఫండ్ లాక్కుంటున్నారని ఆరోపణలు
  • జాతీయ ఎస్సీ కమిషన్‌కు అజయ్ కుమార్‌పై ఫిర్యాదులు
Case on Puvvada Ajay Kumar: మరో వివాదంలో మంత్రి పువ్వాడ అజయ్.. స్టైఫండ్ లాక్కుంటున్నారనీ..

Case on Puvvada Ajay Kumar: మంత్రి అజయ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను బెదిరించి వారికొచ్చే స్టైఫండ్  లాక్కుంటున్నారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ కుమార్ కు చెందిన మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందంటూ వారు ఆరోపిస్తున్నారు.

 మమత మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యం పీజీ విద్యార్థుల స్టైఫండ్ నొక్కేస్తోందని దళిత సంఘాలు మండిపడుతున్నాయి.. ఏవరైనా ఎదురు తిరిగితే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దళితుల నోటికాడ కూడు లాక్కుంటున్న అజయ్ కుమార్ మంత్రి పదవి ఊడగొడతామని హెచ్చరించారు.

కేంద్రం నుంచి దళిత విద్యార్థులకు అందే స్కాలర్ షిప్‌, స్టైఫండ్‌ల విషయంలో పువ్వాడకు చెందిన మమతా కళాశాల అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. విద్యార్థుల చేత విత్ డ్రాయల్ ఫామ్‌లపై సంతకాలు తీసుకుంటున్నారనీ.. అలా చేయని వారిని ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఫిర్యాదు అందడం మంత్రి అజయ్‌కు తలనొప్పిగా మారింది.

ఇప్పటికే బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం మంత్రి అజయ్ కుమార్ తలకు చుట్టుకుంది. బీజేపీ కార్యకర్త అయిన సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో పెను దుమారం రేపింది. అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధించడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విపక్షాలు మండిపడ్డారు. తన చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసులే కారణమంటూ చనిపోయే ముందు సాయి గణేష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన హైకోర్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు నోటీసులు సైతం జారీ చేసింది.

సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు ఆందోళనలకు దిగాయి. తనను పదవి నుంచి తప్పించే కుట్ర జరుగుతోందంటూ పువ్వాడ మండిపడ్డారు. ఒకపక్క ఈ వివాదం సమిసిపోకముందే తాజాగా స్టైఫండ్ అవకతవకల వ్యవహారం తెరపైకి రావడంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మరో తలనొప్పి తప్పేలా లేదు.

 Also Read:  Tamil Nadu to aid Srilanka: శ్రీలంకకు సాయం చేస్తాం.. కేంద్రం అనుమతి కోరిన తమిళనాడు

Also Read:  Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News