Rajakar Movie:  కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దేశ విభజన సమయంలో కశ్మీర్ పండిట్ల విషయంలో  జరిగిన దారుణాలను తన సినిమాలో చూపించారు సినిమా డైరెక్టర్. కశ్మీర్ ఫైల్స్ సినిమా ఊహించిన దాని కంటే సూపర్ హిట్టైంది. దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా సమయంలోనే తెలంగాణలో రజకార్ ఫైల్స్ సినిమా తీస్తామని ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. సెప్టెంబర్ 17న జరిపే వేడుకలకు సంబంధించి తెలంగాణలో పెద్ద వివాదమే ఇలాంటి పరిస్థితుల్లో రజకార్ సినిమా తీస్తే రచ్చ జరగడం ఖాయం. అందుకే బండి సంజయ్ సినిమా ప్రకటనపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే చెప్పడమే కాదు సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో బండి సంజయ్ వేగంగా కదులుతున్నారని తెలుస్తోంది. ఆనాడు జరిగిన రజకార్ ఎపిసోడ్ కు సంబంధించి రెండు సినిమాలకు ప్లాన్ చేస్తోంది. నిజాం పాల‌న‌లో తెలంగాణ ప్రజలు పడిన క‌ష్టాల‌ను ఇప్పటి తరానికి తెలియ‌జేయ‌డ‌మే ల‌క్ష్యంగా సినిమాలు తీయబోతోంది. బండి సంజయ్ డైరక్షన్ లో రజాకార్ సినిమా సెట్స్ పై ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు, రాజస్థాన్ లో షూటింగ్ కొనసాగుతోందని అంటున్నారు. రజకాన్ సినిమాకు నిర్మాతగా బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన బహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్
రజాకార్ ఫైల్స్ పేరుతో మరో కథను తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు.


నిజాం హయాంలో హైద‌రాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలు, ప్రజలు పడిన కష్టాలపై రకరకాల వాదనలు ఉన్నాయి. హిందువులే టార్గెట్ గా రజకార్లు మార‌ణహోమం స్పష్టించారని ఒక వర్గం ఆరోపిస్తోంది. రజకార్ల విషయంలో మొదటినుంచి తీవ్రంగా స్పందించే బీజేపీ.. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే రజకార్ ఫైల్స్ సినిమాకు ప్లాన్ చేసింది. అయితే రజకార్ల విషయంలో రకరకాల చర్చలు ఉన్నందున ఈ సినిమా తెలంగాణలో పెద్ద వివాదంగా మరవచ్చనే  అభిప్రాయనే మెజార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


Read also: TSPSC Group 1: రెండు రోజుల్లో గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు


Read also: Neha Sharma Hot Photos: బెడ్ మీద రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ.. లోదుస్తులు కనిపించేలా హాట్ షో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook