Bandi Sanjay Got Bail in SSC Paper Leak Case: బండి సంజయ్ కుమార్‌కి బెయిల్ మంజూరైంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి హిందీ ప్రశ్న పత్రం లీక్ చేశారనే కేసులో ఏ1 నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి వరంగల్ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత బెయిల్ మంజూరు చేశారు. అంతకంటే ముందుగా బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు సందర్భంగా జడ్జి మూడుసార్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో బండి సంజయ్ కుమార్ కి అసలు బెయిల్ వస్తుందా రాదా అని తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండింది. దాదాపు 8 గంటల నుంచి కొనసాగుతున్న ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు కోర్టు తీసుకున్న నిర్ణయంతో తెరపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు చేయకుండా తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ వరంగల్ పోలీసులు దాఖలు చేసిన కస్టడి పిటిషన్‌ని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.  


సంబరాల్లో బీజేపి నేతలు, కార్యకర్తలు
బండి సంజయ్‌కి బెయిల్ మంజూరైన సందర్భంగా వద్ద బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు కోర్టు బయట వేచిచూస్తున్న బీజేపి నేతలు, కార్యకర్తలు, బండి సంజయ్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ కనిపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపి నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.


బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బెయిల్ లభించడాన్ని ఆ పార్టీ నేతలు స్వాగతించారు. బండి సంజయ్‌కి బెయిల్ లభించడం అనేది ఆయన్ను అక్రమంగా ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇరికించి జైలుకు పంపాలని చూసిన సీఎం కేసీఆర్‌కి, బీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు లాంటిది అని బీజేపి అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడలో అంతిమంగా సత్యమే గెలిచింది అని ఎన్వీ సుభాష్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కి వస్తున్న నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ ని ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుట్రపన్నారని.. న్యాయం గెలవడానికి కొన్నిసార్లు సమయం పడుతుండొచ్చునేమో కానీ అంతిమంగా సత్యం, న్యాయమే గెలిచి తీరుతుంది అని ఎన్వీ సుభాష్ స్పష్టంచేశారు. 


శుక్రవారం ఉదయం బండి సంజయ్ విడుదల


బండి సంజయ్ కుమార్‌కి బెయిల్ లభించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలులో బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. రూ. 20 వేల పూచీకత్తుతో పాటు పలు షరతులపై కోర్టు బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు చేసింది. 


ఇది కూడా చదవండి : SSC Students Complaint on Bandi Sanjay: బండి సంజయ్‌పై పదో తరగతి విద్యార్థుల ఫిర్యాదు


ఇది కూడా చదవండి : Bandi Sanjay Arrest Live Updates: బండి సంజయ్‌కు రిమాండ్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ


ఇది కూడా చదవండి : Bandi Sanjay Arrested: బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మల రామారం పీఎస్‌కి తరలింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK