హైదరాబాద్: కరోనావైరస్ సంక్షోభంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి సంఘీభావం వ్యక్తంచేస్తూ శుక్రవారం నాడు తాను ఒక రోజు ఉపవాస దీక్ష చేపడతానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు లాక్ డౌన్ విధించినప్పటికీ.. అదే సమయంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సర్కార్ అలా చేయడం లేదు కనుకే రైతులకు సంఘీభావంగా తాను ఉపవాస దీక్ష చేపట్టడానికి సిద్ధమైనట్టు ఆయన స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Telangana: కొత్తగా 27 కరోనా కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం


నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్టు బండి సంజయ్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చెయ్యక ఆలస్యం కావడం, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చెయ్యకపోవడంతో రైతులు ఐకెపి సెంటర్లలోనే ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి రావడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తంచేశారు.


Also read : లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు రూ.25,000 జరిమానా


రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాను చేపడుతున్న ఉపవాస ధీక్షకు మద్దతుగా రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఎవరి ఇంట్లో వారు దీక్ష చేపట్టాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..