Telangana BJP leaders farmhouse meeting: హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ.. భవిష్యత్ వ్యూహాలకు పదును పెడుతోంది. 2023లో టీఆర్ఎస్‌ను (TRS) గద్దె దించుతామని చెబుతున్న ఆ పార్టీ... అందుకు ఇప్పటినుంచే రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా పార్టీ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ ముందుకెళ్తోంది. ఇదే అంశంపై చర్చించుకునేందుకు తెలంగాణ బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు శనివారం (నవంబర్ 13) రాత్రి  ఓ ఫాంహౌస్ (Farm house) వేదికగా సమావేశం కాబోతుండటం హాట్ టాపిక్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ నగర శివారులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు చెందిన ఫాంహౌస్‌లో ఈ సమావేశం జరగనుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (Etela Rajender), రఘునందన్ రావు, రాజాసింగ్, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు ఈ సమావేశానికి హాజరవనున్నట్లు సమాచారం. డీకే అరుణ తమ పార్టీ నేతలకు మర్యాదపూర్వకంగా విందు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ... పార్టీ బలోపేతం, భవిష్యత్ ఎజెండాపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.


భవిష్యత్తులో బీజేపీలోకి (Telangana BJP) నేతల వలసలు, ఆపరేషన్ ఆకర్ష్‌ అంశాలపై కూడా తాజా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు, కలిసికట్టుగా ముందుకు సాగేందుకు అవసరమైన ప్రణాళికలు తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక నిరుద్యోగ మిలియన్ మార్చ్‌ను ఎలా విజయవంతం చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.


Also Read: National Sports Awards 2021: అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఫంక్షన్.. పురస్కారాలను అందుకున్న పలువురు క్రీడాకారులు


నిజానికి ఈ నెల 16న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపట్టాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సన్నాహాకంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చైతన్య ర్యాలీలు చేయాలని నిర్ణయించారు.కానీ ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో నిరుద్యోగ మిలియన్ మార్చ్‌ను (Nirudyoga million march) వాయిదా వేయక తప్పలేదు. ఈ కార్యక్రమాన్ని తిరిగి డిసెంబర్ మూడో వారంలో నిర్వహించాలని బీజేపీ (Bandi Sanjay) నిర్ణయించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook