Bandi Sanjay Fire on KCR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని (Bandi Sanjay on CM KCR) ఆరోపించారు.
కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ సహా కేంద్రంపై చేసిన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ సోమవారం కేసీఆర్‌పై ప్రతి విమర్శలు చేశారు.
బండి సంజయ్ ఏమన్నారంటే..
రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు కేసీఆర్ చెప్పారని.. అది ఎంత వరకు నిజమో తెలుసుకునేందుకు నిపుణులతో కలిసి హెలికాప్టర్ ద్వారా సర్వే చేద్దామా? అని ప్రశ్నించారు.
గతంలో కేసీఆరే కేంద్రంతో పని లేకుండా.. ప్రతి గింజా కొంటానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీనర్థం ఏడేళ్లుగా కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని కేసీఆర్ చెప్పదలచుకున్నారా? అని ప్రశ్నించారు. అలా అయితే ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పినట్లు ఒప్పుకోవలని డిమాండ్ చేశారు.
రైతులకు ఎక్కడ రుణమాఫీ చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగారు బండి సంజయ్. కేసీఆర్ సొంత జిల్లాలోనే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటప్పుడు రైతులకు సీఎం ఏం చేశారో చెప్పాలన్నారు.
Also read: CM KCR: నన్ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా?: సీఎం కేసీఆర్
Also read: Telangana: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. మూడు నెలల చిన్నారి మృతి..
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచలేదా?
నిన్న గంటపాటు కేసీఆర్ అబద్ధాలే చెప్పారని బండి సంజయ్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్టం వ్యాట్ పెంచలేదని (Bandi Sanjay on Petrol prices) కేసీఆర్ అబద్ధమాడారాని వెల్లడించారు. 2015లో లీటర్ పెట్రోల్‌పై 4, డీజిల్‌పై రూ.5 వ్యాట్ పెంచలేదా? అని ప్రశ్నించారు.
లీటర్ పెట్రోల్‌పై కేంద్రాని రూ.28 ఆదాయం వస్తే.. రాష్ట్రానికి రూ.27 వస్తోందని తెలిపారు. కేంద్రం వాటాలో తిరిగి రూ.12 రాష్ట్రానికే వస్తుందని పేర్కొన్నారు. ఇదే వాస్తవమన్నారు బండి సంజయ్. 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినప్పుడు తెలంగాణ ఎందకు తగ్గించదని అని బండి సంజయ్ మండిపడ్డారు.
Also read: PF Account Guidelines: ఇక నుంచి ఒకటే పీఎఫ్ ఎక్కౌంట్, ఎక్కువుంటే విలీనం చేసుకోవల్సిందే
Also read: Delhi Air Pollution Today: ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం.. ప్రమాదకర స్థాయికి సూచీ
పెట్రోల్ ధర నయా పైసా తగ్గించేది లేదు..
నిన్న మీడియా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్రపై, బండి సంజయ్‌పై (CM KCR fire on Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడననే విషయం మరచి.. ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే చీల్చి చెండాడుతామని ఆగ్రహం వ్యక్తం (CM KCR on BJP) చేశారు. కేంద్రం అసమర్థతను రాష్ట్రాలపై రుద్దుతారా? బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ఇకపై సహించంమని కేసీఆర్ స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు (CM KCR on Petrol prices) కొండంత పెంచి.. విసరంత తగ్గించారని దుయ్యబట్టారు. ఉప ఎన్నకల్లో బీజేపీకి ప్రజలు ఎదురుదెబ్బ కొట్టారని అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేసీఆర్.
ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపుపై కూడా స్పందిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే ధరలు తగ్గించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నయా పైస తగ్గించే ప్రసక్తే లేదని (No Prcie cut on Petrol in Telangana) స్పష్టం చేశారు. ధరలు ఎవరైతో పెంచారో.. తగ్గించాల్సింది కూడా వారేనని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ.. విమర్శలు చేశారు.
Also read: Five years to the demonetisation: పెద్ద నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు- కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
Also read: Faizabad Junction New Name: ఫైజాబాద్ జంక్షన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’ గా మార్పు చేసిన రైల్వేశాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook