BRS Leader KCR Fires On CM Revanth Reddy: సమ్మర్ కు ముందే తెలంగాణాలో పొలిటికల్ హీట్ కాక రేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఆదివారం జరిపిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు తీవ్ర దుమారంగా మారాయి. బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు పొటాపోటీన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ల దిష్టిబొమ్మలను దహనం చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..


ఇదిలా ఉండగా... మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు గులాబీ బాస్ ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపై పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నేత, కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టుల విషయంపై పోరాటం చేయాలని మాజీ సీఎం పిలుపునిచ్చారు.


దీనిలో భాగంగా ఈనెల 13 న నల్లగొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. కేఆర్ఎంబీ పరిధిలో ప్రాజెక్టులు వెళ్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై సరిగ్గా అవగాహన లేదని విమర్శించారు.


బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు  ముఖ్యమని మాజీ సీఎం కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ప్రజాక్షేత్రంలోనే తెల్చుకుంటామని అన్నారు. మరో ఉద్యోమం కార్యచరణను ప్రారంభించి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతామని మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. 


Read More: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు


ఇదిలా ఉండగా.. ఈరోజు పెద్ద పల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు. తనకు కూడా బోలేడు ఆఫర్ లు వస్తున్నాయని సెట్ లు వేశారు. కాంగ్రెస్ కు తప్పకుండా బుద్ధి చెప్తామని మల్లారెడ్డి అన్నారు. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook