MLC Kavitha: పోలీసుశాఖకు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్.. సీఎం రేవంత్ పై కేసు పెట్టాలి.. లేకపోతే..
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా కవిత స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని ఆమె అన్నారు.
BRS MLC Kalvakuntla Kavitha Fires On CM Revanth Reddy: తెలంగాణ లో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం వరకు వెళ్లి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మరీ సొంత రాష్ట్రం సాధించుకునేలా చేసిన కేసీర్ ను పట్టుకుని సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోందని కవిత ఫైర్ అయ్యారు.
Read More: Home Cleaning Tips: అరటిపండు తొక్కపై నిమ్మకాయను రాస్తే ఏమౌతుందో తెలుసా?
సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని మండిపడ్డారు. అదే విధంగా, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని కల్వకుంట్ల కవిత ఎద్దెవా చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ముందుగా పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ.. పోలీసులు కేసులు నమోదు చేయకుంటే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
Read More: Animal: నెట్‌ఫ్లిక్స్‌లో సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ 'యానిమల్' మరో సెన్సేషనల్ రికార్డు..
సీఎం రేవంత్ రెడ్డి గత ఆదివారం మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనను, ఆయన హయాంలో జరిగిన అన్యాయాలపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను అసభ్య పదజాలంతో దూషించడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ఘటనలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరో పీక్స్ కు చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook