Telangana Budget 2022: నేడు తెలంగాణ బడ్జెట్.. ఎమ్మెల్యే ఈటెల అసెంబ్లీ రాకపై పోలీసుల ఆంక్షలు!!
Police Restrictions on Huzurabad MLA Etela Rajender: తెలంగాణ పోలీసు శాఖ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై ఆంక్షలు విధించింది. అసెంబ్లీ సమావేశాలకు ఈటలతో పాటు ఎవరు వెళ్లకూడదని ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Police Restrictions on Huzurabad MLA Etela Rajender: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. ఇక శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార, విపక్షాల వ్యూహప్రతివ్యూహాలతో వాతావరణం వేడెక్కనుంది.
ఎన్నో అనూహ్య పరిణామాల అనంతరం టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్.. హుజురాబాద్ బై ఎలెక్షన్స్‌లో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. హుజురాబాద్ ఎన్నికల తరువాత మొదటిసారి ఎమ్మెల్యే ఈటెల అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. అనేక నిర్బంధాలు, ప్రలోభాలకు సైతం ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన హుజురాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఈటలకు తోడుగా ఉండి అసెంబ్లీకి పంపించాలనుకున్నారు. భారీ ర్యాలీతో ఈటెలను అసెంబ్లీ సమావేశాలకు పంపాలని ప్లాన్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసు శాఖ ఈటెల రాజేందర్‌పై ఆంక్షలు విధించింది. మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్లనున్న నేపథ్యంలో భారీ ర్యాలీతో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్నారని సమాచారం మేరకు పోలీసులు షామీర్‌పేట్‌లో గల ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంటిముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఈటలతో పాటు ఎవరు వెళ్లకూడదని ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారని సంబంధిత అధికారులు ఈటలకు సూచించారు.
తమ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై తెలంగాణ పోలీసు శాఖ ఆంక్షలు విధించడంతో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఈటెల అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తుందని వారు అంటున్నారు. ఇక పోలీసుల తీరుపై ఈటెల అభిమానులు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈటెల ఇంటి ప్రాంగణంలో ఉద్రిక్త పరిష్టితులు నెలకొననున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook