Horoscope Today March 7 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రమ వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు!

March 7 2022 Horoscope: కర్కాటకం, కుంభం రాశుల వారికి ఈరోజు అనుకూల వాతావరణం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారు ప్రేమ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 08:11 AM IST
  • Match 7 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారు ప్రమ వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు
Horoscope Today March 7 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రమ వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు!

Horoscope Today March 7 2022: మేషం ( Aries): సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అన్ని పనుల్లో ఉత్సాహంగా పని చేయాలి. అనవసర ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విష్ణు నామస్మరణ మంచిది.

వృషభం (Taurus): అన్ని రంగాల వారు శ్రద్ధగా పనిచేయాలి. సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది

మిథునం (Gemini): శుభకాలం నడుస్తోంది. మనో ధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వస్త్ర లాభాలున్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

కర్కాటకం (Cancer): కీలక పనుల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవాలి. ప్రేమికులు అనుకున్నది సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

సింహం (Leo): మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గోవింద నామాలు పఠించడం మంచిది.

కన్య (Virgo): శ్రమకు తగిన ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో గడుపుతారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. దత్తాత్రేయుడిని ఆరాధన మంచిది.

తుల (Libra): కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

వృశ్చికం (Scorpio): ప్రతిపనిలో ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. బంధుమిత్రులతో హాయిగా గడుపుతారు. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనస్సు (Sagittarius): స్థిర చిత్తంతో చేసే పనులు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

మకరం (Capricorn): మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. డబ్బు చేతికి అందుతుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రగ్రహ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

కుంభం  (Aquarius): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. మనసుసంతోషాన్ని పొందుతుంది. కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు శుభకాలం. అనుకున్నది సాధిస్తారు.  విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మీనం (Pisces): మీమీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో ఫలితాలు సిద్ధిస్తాయి. చంద్ర ధ్యానం జపించడం ఉత్తమం.

Also Read: AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాస్సేపట్లో ప్రారంభం, ఎన్నిరోజులంటే..

Also Read: Operation Ganga: ఆపరేషన్ గంగ అప్‌డేట్స్ వివరించిన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News