తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం
రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గ సభ్యుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన 10 మంది మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో తొలత ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తలసాని శ్రీనివాస్, జగదీష్ రెడ్డి,ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా ప్రమాణస్వీకారంతో తెలంగాణ మంత్రివర్గం సభ్యుల సంఖ్య 12కి చేరింది