Telangana Cabinet Meeting: సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో కొత్త ఉద్యోగాల ప్రకటనతో పాటు నిధుల విడుదలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా వ్యవసాయం, నిర్మాణ రంగం, పోలీస్ శాఖలకు సంబంధించిన తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగాల భర్తీ, కొత్త పోస్టుల ప్రకటనతో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీలో ఉద్యోగాలు..


పోలీస్ శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరో 3,996 పోస్టుల భర్తీకి చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు ఆమోద ముద్ర వేసింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను భర్తీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డీఈఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుండగా.. సత్వరమే పదోన్నతులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


విద్యాసంస్థల్లో నియామకాలు..


రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 2591 నూతన ఉద్యోగాల నియామకాలకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆయా శాఖలను మరింత పటిష్టం చేసేందుకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. అదేవిధంగా 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 


ఆర్ అండ్ బీ శాఖకు నిధుల వర్షం


రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు మంత్రి మండలి నిధుల వర్షం కురిపించింది. ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతు (పీరియాడిక్ రెన్యువల్స్)ల కోసం 1865 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో  ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు రూ.635 కోట్ల నిధులను కేటాయించింది.


ఎమర్జెన్సీ టైమ్‌లో ప్రజావసరాలకు అనుగుణంగా.. అసౌకర్యాన్ని తొలగించి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేందుకు కిందిస్థాయి డీఈఈ నుంచి పై స్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఒకే చెప్పింది. విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డీఈఈకి ఒక్క పనికి రూ.2 లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు), ఈఈకి రూ.25 లక్షల వరకు (ఏడాదికి రూ.1.5 కోట్లు), ఎస్ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి రూ.2 కోట్లు), సీఈ పరిధిలో  రూ.1 కోటి వరకు (సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో పనులు చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకోసం ఏడాదికి రూ.129 కోట్లు  ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.


Also Read: Pawan Kalyan: ట్యాక్స్ కట్టేందుకు పవన్ కళ్యాణ్‌ రూ.5 కోట్ల అప్పు.. జనసేన నేత వీడియో వైరల్  


Also Read: Sukhvinder Singh Sukhu: సుఖ్విందర్ సింగ్.. హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం ఎవరో తెలుసా ?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook