Telangana Cabinet Meeting Telangana Health and Family Welfare Minister Harish Rao says ready to face any situation for Covid : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం (Telangana Cabinet Meeting) కొనసాగుతోంది. తెలంగాణలో కొవిడ్ పరిస్థితులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లోని వస‌తులు, ఆక్సిజన్‌, మందుల లభ్యత, వ్యాక్సి‌నే‌షన్‌ (Vaccination) ప్రక్రియపై మంత్రిమండలి చర్చిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్‌ (Covid‌) అంశంతో పాటు కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటా‌యిం‌పులు పూర్తయిన నేప‌థ్యంలో వచ్చిన అప్పీళ్లపై కూడా కేబినెట్‌ చర్చిస్తోంది. ఉద్యో‌గాల ఖాళీలు, నోటి‌ఫి‌కే‌షన్ల ప్రక్రియ తది‌తర అంశా‌లపై కూడా కేబినెట్‌లో (Cabinet) చర్చ సాగుతున్నట్లు సమాచారం. 


అయితే ఇప్పటికే కొవిడ్ తీవ్రత, నియంత్రణపై చర్యలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. తెలంగాణలో కరోనా (Corona) పరిస్థితులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) కేబినెట్‌కు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణలో కొవిడ్ నియంత్రణలోనే ఉందంటూ హరీశ్‌రావు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. 


Also Read : కెప్టెన్సీ ముప్పును గ్రహించి.. కోహ్లీ ముందే తప్పుకున్నాడు! సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్!


తెలంగాణలో (Telangana) ఇప్పటికే ఐదుకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే కొవిడ్‌ను నియంత్రించవచ్చని మంత్రి (Minister) పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు (Covid cases) పెరుగుతుండటం వల్ల ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. స్కూళ్లు, కాలేజీల సెలవులను ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 


Also Read : Credit Card Late Fee Charges: క్రెడిట్ కార్డు బిల్లులపై లేట్ ఫీజు తక్కువ వసూలు చేసే బ్యాంకు ఏదో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook