నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
`కరోనా వైరస్`.. విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పక్కాగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. దీంతో ఏం చేయాలనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడాని ఇవాళ (ఆదివారం) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.
'కరోనా వైరస్'.. విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పక్కాగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. దీంతో ఏం చేయాలనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడాని ఇవాళ (ఆదివారం) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సీఎం నివాసం ప్రగతి భవన్ లో నేడు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. 'కరోనా వైరస్' ఉద్ధృతి ఎలా ఉంది..? వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏంటి..? జిల్లాల వారీగా పరిస్థితి ఏంటి..? లాక్ డౌన్ అమలు తీరు ఎలా ఉంది..? అనే అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారుల అభిప్రాయలు తీసుకోనున్నారు మఖ్యమంత్రి కేసీఆర్.
ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఏవి..?
అలాగే కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐతే ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 20 అంటే రేపు (సోమవారం) కొన్ని రంగాలకు పాక్షికంగా అనుమతులు మంజూరు చేస్తూ ఓ జాబితా విడుదల చేసింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. దీంతో లాక్ డౌన్ ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించడమా..? లేక కేంద్రం మార్గదర్శకత్వం ప్రకారం రేపటి నుంచి సడలింపులు ఇవ్వడమా..? అనే అంశాలపై తెలంగాణ మంత్రివర్గం ఈరోజు విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ రోజు సీఎం కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే..!! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..